24, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఖిలాషాపూర్ కోట (Khila Shapur Fort)

ఖిలాషాపూర్ కోట
గ్రామంఖిలాషాపురం
జిల్లావరంగల్ జిల్లా
నిర్మాతసర్వాయి పాపన్న
ఖిలాషాపూర్ కోట వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఖిలాషాపురం గ్రామంలో ఉంది. 17వ శతాబ్ది చివరిలో మొఘల్ సేనలను గడగడలాండించి, మూడు చెరువుల నీళ్ళు త్రాగించి, స్థానిక బీదప్రజలకు చేదోడుగా నిలిచిన సర్వాయి పాపన్న ఈ కోటను నిర్మించాడు. ఛత్రపతి శివాజీకి సమకాలీనుడైన పాపన్న శివాజీ వలనే మొఘల్‌లకు ధీటుగా ఎదుర్కొన్నాడు. పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేకున్నా ప్రజల కొరకు, ప్రజలచేత ఒక్కో ప్రాంతంపై పట్టు సాధించి పలు కోటలను నిర్మించి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

చరిత్ర:
మొఘలులు 1965లో అక్కన్న, మాదన్నలను చంపివేశారు.1687లో గోల్కొండ మళ్ళీ మొఘల్ వశమైంది. ఈ స్థితిలో సర్వాయి పాపన్న మొఘల్‌లకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. 1680-1710 కాలంలో సర్వాయి పాపన్న మొఘల్ పాలకులకు సింహస్వప్నంగా నిలిచాడు. ఆ కాలంలోనే ఖిలాషాపూర్ కోటను సర్వాయి పాపన్నచే నిర్మించబడింది. పశ్చిమాన పెద్ద ద్వారం ఉన్న ఈ కోటకు నలువైపులా 4 మినార్లు, మధ్యలో గుండ్రటి స్థూపం ఉంది. ఈ కోట నుంచి సొరంగాలు, రహస్య మార్గాలు కూడా ఉన్నాయి. ఈ కోట నుంచే సర్వాయి పాపన్న పాలించినట్లు చరిత్ర తెలుపుతోంది. చివరికి నమ్మక ద్రోహుల వల్ల మొఘల్ సేనలకు చిక్కి ఆత్మహత్య చేసుకున్నాడు.

విభాగాలు: వరంగల్ జిల్లా కోటలు, తెలంగాణ కోటలు, రఘునాథపల్లి మండలం,


 = = = = =


2 వ్యాఖ్యలు:

 1. ప్రత్యుత్తరాలు
  1. కమనీయం గారూ, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. వ్యాసాలలో సాధ్యమైనంతవరకు ఉచిత (కాపీహక్కులు లేని) ఫోటోలు పెడుతుంటాను. కాని దీనికి సంబంధించి నాకు అలాంటి చిత్రం లభ్యం కానందున పెట్టలేకపోయాను. పాత గ్రంథాలలో ఎక్కడైనా దొరికితే తప్పకుండా చేరుస్తాను.

   తొలగించు

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక