4, మే 2015, సోమవారం

రఘునాథపల్లి మండలం (Raghunathapally Mandal)

రఘునాథపల్లి మండలం
జిల్లాజనగామ జిల్లా
జనాభా 53171 (2011),
అసెంబ్లీ నియో.స్టేషన్ ఘన్‌పూర్ అ/ని,
లోకసభ నియో.వరంగల్ లో/ని,
రఘునాథపల్లి జనగామ జిల్లాకు చెందిన మండలము. సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్ మండలం గుండా వెళ్ళుచున్నది. ప్రముఖ తెలుగు కవి పేర్వారం జగన్నాథం, పిసిసి అధ్యక్షుడిగా- రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. ఖిలాషాపురంలో సర్వాయి పాపన్న నిర్మించిన కోట ఉంది. ఖిలాషాపూర్, కంచన్‌పల్లి, రఘునాథపల్లి మండలంలోని పెద్ద గ్రామాలు. ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2016 అక్టోబరు 11కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన స్టేషన్ ఘన్‌పూర్ మండలం, తూర్పున జఫర్‌ఘడ్ మండలం, దక్షిణాన లింగాల ఘన్‌పూర్ మండలం, పశ్చిమాన జనగామ మండలం, వాయువ్యాన నర్మెట్ట మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర:
మొఘలులకు వ్యతిరేకంగా ఒంటిచేతిలో పోరాడి ముప్పుతిప్పలు పెట్టిన సర్వాయి పాపన్న ఈ మండలంలోని ఖిలాషాపూర్ గ్రామానికి చెందినవాడు. ఆయన నిర్మించిన కోట ఈ గ్రామంలో ఉంది. అంతకుక్రితం ఈ ప్రాంతం కాకతీయుల పాలనలో ఉండేది. ఆధునిక కాలంలో ఈ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీ, నిజాంషాహీలచే పాలించబడి 1948లో నిజాం చెరనుంచి బయటపడి హైదరాబాదు రాష్ట్రంలోనూ, 1956-2014 కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగి 2014 జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఉంది.2016 అక్టోబరు 11న తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి జనగామ జిల్లాలోకి మారింది.

రాష్ట్ర మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా
పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య
జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 52,876. ఇందులో పురుషులు 26509, మహిళలు 26367.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53171. ఇందులో పురుషులు 26472, మహిళలు 26699.

రవాణా సౌకర్యాలు:
సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్, మరియు హైదరాబాదు వరంగల్ ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ఈ మండలమునకు చెందినవారు.

మండలంలోని గ్రామాలు:
అశ్వరావ్ పల్లి · ఇబ్రహింపుర్ · కన్నాయిపల్లి · కల్వలపల్లి · కాంచనపల్లి · కుర్చపల్లి · కోడూర్ · కోమల్ల · ఖిలాషాపూర్ · గబ్బెట · గోవర్ధనగిరి · నిడిగొండ · ఫతేషాపుర్ · భాంజిపేట · మధరం · మేకలగట్టు · రఘునాథపల్లి · వెల్ది · శ్రీమన్ నారాయణపుర్

విభాగాలు: జనగామ జిల్లా మండలాలు, రఘునాథపల్లి మండలం, స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక