4, డిసెంబర్ 2013, బుధవారం

ఉడిమేశ్వరం (Udimeswaram)

ఉడిమేశ్వరం గ్రామము
గ్రామముఉడిమేశ్వరం 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా856 (2001)
1005 (2011)
ఉడిమేశ్వరం మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో ఈశాన్యంలో ఉంది. ఈ గ్రామానికి ఆగ్నేయాన కోడంగల్, దక్షిణాన మరియు పశ్చిమాన అప్పాయిపల్లి గ్రామం, ఉత్తరాన రంగారెడ్డి జిల్లా, తూర్పున బొంరాస్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 856. ఇందులో పురుషులు 437, మహిళలు 419. గృహాల సంఖ్య 178.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1005. ఇందులో పురుషులు 498, మహిళలు 507. గృహాల సంఖ్య 210. అక్షరాస్యత శాతం 43.58%. గ్రామ కోడ్ సంఖ్య 574904.

రవాణా సౌకర్యాలు:
కోడంగల్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధానరహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. కాబట్టి ప్రధాన పట్టణాలకు వెళ్ళడానికి గ్రామస్థులకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి