27, జులై 2018, శుక్రవారం

మునగాల మండలం (Munagala Mandal)

మునగాల మండలం
జిల్లా సూర్యాపేట
రెవెన్యూ డివిజన్ కోదాడ
అసెంబ్లీ నియోజకవర్గంకోదాడ
లోకసభ నియోజకవర్గంనల్గొండ
మునగాల సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. పూనా-విజయవాడ (65వ నెంబరు ) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు కలవు. నిజాం విమోచనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన కోదాటి నారాయణరావు ఈ మండలమునకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి తూర్పున నడిగూడెం మండలం, దక్షిణాన చిల్కూరు మండలం, పశ్చిమాన పెన్‌పహాడ్ మండలం, ఉత్తరాన మోతె మండలం, వాయువ్యాన చివ్వెంల మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 43116, 2011 నాటికి జనాభా 546 పెరిగి 43662 కు చేరింది. ఇందులో పురుషులు 22233, మహిళలు 21429.

రాజకీయాలు:
ఈ మండలము కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Akupamula, Barakathgudem, Ganapavaram, Kalakova, Kokkireni, Madhavaram, Munagala, Nelamarri, Repala, Syed Muzavarpeta, Tadvai,

ప్రముఖ గ్రామాలు
రేపాల (Repala):
హైదరాబాదు విమోచనోద్యమంలో ఈ గ్రామం ప్రముఖ పాత్ర వహించింది. విమోచనకారులు ఏర్పాటు చేసిన 4 క్యాంపులలో ఇదొకటి. నిజాం వ్యతిరేకోద్యమంలో పాల్గొన్న కోదాటి నారాయణ రావు ఈ గ్రామంలోనే జన్మించారు.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


విభాగాలు: సూర్యాపేట  జిల్లా మండలాలు,  మునగాల మండలము, కోదాడ రెవెన్యూ డివిజన్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 246 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Kodati Narayanarao, Munagala Mandal Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి