గ్రంథాలయ ఉద్యమంలోనూ, ప్రారంభంలో విశాలాంధ్ర తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ, నిజాం వ్యతిరేక పోరాటంలోనూ చురుకుగా పాల్గొన్న కోదాటి నారాయణరావు 1914లో సూర్యాపేట జిల్లా రేపాల గ్రామంలో జన్మించారు. న్యాయవాదాన్ని అభ్యసించి తర్వాత కొన్ని పత్రికలలో పనిచేసి, ఆ తర్వాత ప్రజాపోరాటాలలో పాలుపంచుకున్నారు. నారాయణత్రయంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణకు చెందిన ముగ్గురు నారాయణరావులలో వీరు ఒకరు. 2002లో కోదాటి మరణించారు.
బాల్యం, విద్యాభ్యాసం: కోదాటి నారాయణరావు నల్గొండ జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో డిసెంబరు 15, 1914న జన్మించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బి అభ్యసించి హైదరాబాదులో స్థిరపడ్డారు. హైదరాబాదు సంస్థానంలో తెలంగాణ ప్రజలను జాగృతం చేశారు. విజయవాడ నుంచి వెలువడే ఆంధ్రవాణి పత్రికకు విలేకరిగా, కొంతకాలం గోల్కొండ పత్రికలో, రయ్యత్ పత్రికలో కూడా పనిచేశారు. ప్రజా ఉద్యమాలు: 1940లో ధర్మవరంలో జరిగిన సభలో నిజాం ప్రభుత్వ రాజకీయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. 1941ఆంధ్రమహాసభలో విశాలాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అజ్ఞాతంగా పనిచేశారు. 1948లో నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1948-49లో అఖిల భారత కాంగ్రెస్ కమిటి సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు. తెలంగాణా ఉద్యమంలో కోదాటి, కాళోజీ, కొమరగిరి నారాయణరావులు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరు ముగ్గురు "నారాయణ త్రయం" గా పిలువబడ్డారు. కాకతీయ విశ్వవిద్యాలయం కోదాటికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. కోదాటి నారాయణరావు నవంబరు 11, 2002న మరణించారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
17, ఫిబ్రవరి 2014, సోమవారం
కోదాటి నారాయణరావు (Kodati Narayana Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి