26, జనవరి 2019, శనివారం

సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)

సిరివెన్నెల సీతారామశాస్త్రి
జననంమే 20, 1955
రంగంసినీగేయ రచయిత
గుర్తింపులుపద్మశ్రీ (2019), 11 సార్లు నంది అవార్డులు,


ప్రముఖ సినీగేయ రచయితగా పేరుపొందిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మే 20, 1955న మధ్యప్రదేశ్‌లోని శిబినిలో జన్మించారు. స్వస్థలం అనకాపల్లి కాగా ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు. సిరివెన్నెల అసలు ఇంటిపేరు చేంబోలు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1985లో తొలిసారిగా సిరివెన్నెల సినిమాకై పాటలు రాసి ఆ సినిమాపేరే ఇంటిపేరుగా స్థిరపడింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదట్లో భరణి కలంపేరుతో పత్రికలలో కథలు, కవితలు రాశారు. తొలిసారిగా సిరివెన్నెల సినిమాకై విధాత తలఁపున ప్రభవించినది... పాటరాశారు.
మొత్తం 300 పైగా సినిమా పాటలు రాసిన సిరివెన్నెల రాష్ట్రప్రభుత్వం నుంచి 11 సార్లు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు, 4 సార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందారు. 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు.

విభాగాలు: తెలుగు సినిమా, నంది అవార్డు గ్రహీతలు, పద్మశ్రీ గ్రహీతలు, 1955లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి