ప్రముఖ రాజకీయ నాయకుడు, రాష్ట్రపతిగా పనిచేసిన ప్రనబ్ ముఖర్జీ డిసెంబరు 11, 1935న మిరాఠీ (పశ్చిమబెంగాల్) లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రణబ్ ముఖర్జీ కేంద్రంలో ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆగస్టు 31, 2020న మరణించారు.
ఇందిరాగాంధీ హయంలో 1973లో తొలిసారిగా కేంద్రంమంత్రిమండలిలో స్థానం పొందిన ప్రణబ్ ముఖర్జీ ఇందిర మరణం తర్వాత అనుభవం లేని రాజీవ్‌గాంధీని ప్రధానిగా చేయడాన్ని తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీకి దూరమై 1986లో రాష్ట్రీయ సమాజ్‌వాది కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాని 1989లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజీవ్ గాంధీ మరణానంతరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్రవహించి పలు ఉన్నతమైన పదవులు పొందారు. పి.వి. నరసింహరావు కాలంలో 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటి చైర్మెన్‌గా నియమించబడ్డారు. 2012లో రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీ పి.ఏ.సంగ్మాపై విజయం సాధించి భారత 13వ రాష్ట్రపతిగా అధికారం స్వీకరించారు. ఈయన సేవలకు గుర్తింపుగా 2008లో పద్మవిభూషణ్ పురస్కారం, 2013లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ హానర్ పురస్కారం, 2019లో అత్యున్నతమైన భారతరత్న పురస్కారాలు లభించాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి