15, సెప్టెంబర్ 2013, ఆదివారం

గుంటూరు (Guntur)

 గుంటూరు
జిల్లాగుంటూరు జిల్లా
జనాభా6,51,282 (2011)




గుంటూరు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలలో ఒకటి. 2011 జనాభా ప్రకారం ఈ నగరం రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన 4న నగరంగా నిలిచింది. ఈ నగరం జిల్లాకేంద్రముగా, రైల్వే డివిజన్ కేంద్రంగా, లోకసభ నియోజకవర్గ కేంద్రంగా ఉన్నది. ఆంధ్రరాష్ట్ర హైకోర్టు కూడా గుంటూరులో ఉండేది. చరిత్రలో గర్తపురిగా పిలువబడిన గుంటూరు కేంద్రంగా ఎన్నో రాజ్యాలు పాలించాయి. 1788లో బ్రిటీష్ వారి అధీనంలోకి వెళ్ళకముందు మైసూరు రాజ్యంలో భాగంగా ఉండేది. రవాణాపరంగా చూస్తే ఈ పట్టణం 3 జాతీయ రహదారులలో సంబంధం ఉంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఈ నగరంలోనే జన్మించారు. హీలియం వాయువును తొలిసారిగా కనుగొన్న ప్రాంతంగా ఈ నగరం విశిష్ట స్థానం పొందింది. నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు నగరంలో ఉంది.

భౌగోళికం:
గుంటూరు నగరం 16.20° ఉత్తర అక్షాంశం మరియు 80.27° తూర్పు రేఖాశంపై సముద్ర మట్టానికి సుమారు 33 మీటర్ల ఎత్తులో సముద్ర తీరానికి 64 కిమీ దూరంలో ఉంది. నగర విస్తీర్ణము 11.68 చ.మైళ్ళు. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో భాగమైన ఈ నగరం గుండా చిన్నచిన్న కాలువలు ప్రవహిస్తున్నాయి.

జనాభా:
2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 6,51,282. 2012 జూలైలో మరో 10 గ్రామాలు విలీనం కావడంతో నగర జనభా 7.50 లక్షలు దాటింది.

చరిత్ర:
గుంటూరుకు సంబంధించిన మొట్టమొదటి చారిత్రక ఆధారం క్రీ.శ.10వ శతాబ్ది నాటి మొదటి అమ్మరాజు (వేంగి చాళుక్యరాజు) కాలం నాటిది లభ్యమైంది. నగర సమీపంలో చెరువులు ఉండుటచే దీనికి గర్తపురిగా చరిత్రలో పిలువబడినట్లు అగస్తేశ్వర శివాలయంలోని శాసనాధారం ప్రకారం తెలుస్తోంది. బుద్ధుడు స్వయంగా తొలి కాలచక్రను ఈ నగరంలో నిర్వహించినట్లు తెలుస్తుంది. ఫ్రెంచివారు కూడా ఈ నగరాన్ని తమ ప్రధానస్థావరంగా చేసుకున్నారు. ఆ తర్వాత హైదర్ అలీ కాలంలో ఇది మైసూరు రాజ్యంలో భాగంగా ఉండేది. 1788లో ఆంగ్లేయుల అధీనంలోకి వెళ్ళింది. 1822లో ఈ ప్రాంతంలో తీవ్రకరువు సంభవించింది. స్వాతంత్ర్యోద్యమంలో ఈ నగరం ప్రముఖపాత్ర వహించింది. ప్రముఖ సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఈ నగరంలోనే జన్మించారు. బ్రిటీష్ కాలంలో మద్రాసు రాష్ట్రంలో భాగంలో ఉన్న ఈ నగరం 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రంలోకి వచ్చిన పిదప ఆంధ్రరాష్ట్ర హైకోర్టు 1956 నవంబరు వరకు ఈ నగరంలోనే ఉండేది. 212 జూలైలో పరిసర 10 గ్రామాలను విలీనం చేసి గ్రేటర్ గుంటూరును ఏర్పాటుచేశారు.

గుంటూరు ప్రధాన రైల్వేస్టేషన్
వ్యవసాయం- పరిశ్రమలు:
ఈ ప్రాంతం ఎండుమిరప మరియు ప్రత్తి పంటలకు ప్రసిద్ధి. దేశంలోని 30% ఎండుమిరప విక్రయాలు గుంటూరు మార్కెట్ యార్డు ద్బారా సాగుతాయి. మిరప పరొశోధన కేంద్రం లాం నగర సమీపంలో ఉంది. నగరంలో ప్రత్తి బోర్డు ఏర్పాటుచేశారు. అలాగే చేనేత, సిల్క్, సిమెంటు, రసాయన తదితర పరిశ్రమలు కూడా నగరంలో ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన డివిజన్ కార్యాలయం గుంటూరులో ఉంది. నగరంలో 4 రైల్వేస్టేషన్లు కలవు.

రవాణా సౌకర్యాలు:
3 ముఖ్యమైన జాతీయ రహదారులు చెన్నై-కోల్‌కత, గుంటూరు-హైదరాబాదు, గుంటూరు-బళ్ళారి జాతీయ రహదారులు నగరం గుండా వెళ్ళుచున్నాయి.

విద్యాసంస్థలు:
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, పురాతనమైన ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల తదితర విద్యాసంస్థలు నగరంలో ఉన్నాయి.


ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ నగరాలు, గుంటూరు జిల్లా,


 = = = = =

సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • ఆంధ్రప్రదేశ్ దర్శిని,
  • గుంటూరు జిల్లా ప్రభుత్వ వెబ్‌సైట్,
  • గుంటూరు జిల్లా నాడు-నేడు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక