రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, పత్రికా సంపాదకుడిగా పేరుపొందిన రావి కొండలరావు ఫిబ్రవరి 11, 1932న సామర్లకోటలో జన్మించారు. సుమారు 600 పైగా సినిమాలలో పనిచేసిన రావి కొండలరావు రచించిన తొలి కథ దైవేచ్ఛ మరియు రాసిన తొలి నాటిక స్వయంవరం. 1956లో బంగారుపాప పత్రికను ప్రారంభించారు. సుకుమార్ కలంపేరుతో రచనలు చేశారు. 1966-93 వరకు విజయచిత్ర రూపశిల్పిగా వ్యవహరించారు.
రావి కొండలరావు పెళ్ళిపుస్తకం సినిమాకు కథను అందించి బంగారునంది అవార్డు పొందారు. సినీరంగ విశేషాలతో "బ్లాక్ అండ్ వైట్" రచించి దీనికి కూడా నంది అవార్డు పొందారు. ఈయన ఆత్మకథ "నాగావళి నుంచి మంజీరా వరకు". ఆంధ్రా విశ్వవిద్యాలయంచే కళాప్రపూర్ణ బిరుదు పొందారు. భార్య రాధాకుమారి కూడా సినీనటిగా పేరుపొందింది. కొండలరావు జూలై 28, 2020న హైదరాబాదులో మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి