సినీనటిగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా మరియు మోడల్‌గా పేరుపొందిన రేణూదేశాయ్ డిసెంబరు 4, 1981న పూణె (మహారాష్ట్ర)లో గుజరాతి కుటుంబంలో జన్మించింది. సినీనటుడు పవన్ కళ్యాణ్‌ను వివాహం చెసుకొని తర్వాత విడిపోయింది. 2000లో తమిళంలో జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, సహజీవనం కూడా చేశారు. 2004లో వీరిద్దరికి పెళ్ళి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు. ఆ తర్వాత 2009లో వివాహం చేసుకున్నారు కాని 2012లోనే విడాకులు తీసుకున్నారు. 2014లో ఈమె దర్శకత్వం వహించి ఇష్క్ వాలా లవ్ సినిమా తీసింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి