హైదరాబాదు నగరంలోనే ప్రఖ్యాతి గాంచిన భాగ్యలక్ష్మి ఆలయం చార్మినార్ వద్ద ఉంది. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారనే విషయంలో ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు కాని చాలా కాలం నుంచి ఈ ఆలయం పూజలందుకుంటున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాదును సందర్శించే ప్రముఖ నాయకులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. నవంబరు 2020లో హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలో హైదరాబాదు వచ్చిన ప్రముఖ భాజపా నాయకుడు, కేంద్రమంత్రి అమిత్ షా మరియు భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ముందుగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాదం పొందారు.
ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారనే దానిపై ఖచ్చితమైన ఆధారాలు లభించలేవు కాని ఏ భారీ కట్టడమైనా నిర్మించే సమయంలో వడ్డెరలు ముందుగా అమ్మవారి ప్రతిష్టాపన చేస్తారనే విషయంలో ఎలాంటి సంగిగ్దత లేదని చరిత్రకారుల కథనం. మక్కామసీదు మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం లాంటి కట్టడాలు నిర్మించే సమయంలో కూడా వడ్డెరలు అమ్మవారిని ప్రతిష్టాపన చేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయానికి కూడా చార్మినార్ నిర్మాణం సమయంలోనే ఒక రాయిరూపంలో అమ్మవారిని ప్రతిష్టించినట్లుగా, ఆ రాయి అమ్మవారి ప్రతిరూపమేనని కొందరు రచయితలు అభిప్రాయపడ్డారు. చార్మినార్‌కు తాకుతూ ఒక రాయి ఉండేదనీ, దానికే జీరో మైలురాయిగా పిలిచేవారనీ హైదరాబాదు చరిత్రను పరిశోధించిన పలువులు పేర్కొన్నారు. ఆ రాయికి కుంకుమ, పసుపుతో పుజలు చేసేవారు. 1970 దశకంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక బస్సు డ్రైవర్‌చే రాయి దెబ్బతింది. ఆ రాయి అమ్మవారి స్వరూపమనీ, దెబ్బతిన్న రాయి పూజకు పనికి రాదనీ అమ్మవారి ఫోటో పెట్టారు. అది వివాదానికి దారితీసింది. నగరంలో కర్ఫ్యూ లాంటి వాతావరణం ఏర్పడింది. వివాదంలో ఫోటో కూడా దెబ్బతినడంతో విగ్రహాన్ని పెట్టారు. తొలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఇనుప రాడ్లతో ఆలయం రూపంలోకి మార్చబడింది. ఈ వివాదం హైకోర్టు వరకు వెళ్లగా న్యాయస్థానం దాన్ని స్టాటస్‌కో గా ఉంచి ఎలాంటి అభివృద్ధి పనులు చేయరాదనీ పేర్కొంది. క్రమక్రమంగా అప్పటి నుంచి భక్తుల తాకిడి కూడా ఎక్కువైంది. చార్మినార్ ను సందర్శించే హిందువులు ఈ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి