3, జనవరి 2021, ఆదివారం

రామేశ్వర్ రావు జూపల్లి (Rameshwar Rao Jupally)

జననం
సెప్టెంబరు 16, 1955
స్వస్థలం
కుడికుళ్ళ (కొల్లాపూర్ మండలం)
రంగం
పారిశ్రామికవేత్త, టివి ఛానెల్ అధినేత
కంపెనీ
మై హోం (My Home)
పారిశ్రామికవేత్తగా, రియల్ ఎస్టేట్ అధినేతగా, టెలివిజన్ ఛానెల్ యజమానిగా ప్రసిద్ధిచెందిన రామేశ్వర్ రావు జూపల్లి సెప్టెంబరు 16, 1955న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికుళ్ళలో జన్మించారు. వృత్తితీర్త్యా ప్రారంభంలో హోమియోపతి వైద్యుడు. మొదట్లో దిల్‌సుఖ్‌నగర్ (హైదరాబాదు)లో హోమియోపతి ఆసుపత్రి స్థాపించారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి పేరుగాంచారు. 1991లో My Home Group కంపెనీ స్థాపించి పారిశ్రామికవేత్తగా నిర్మాణ రంగంలో పేరుపొందారు. 1996లో మహాసిమెంట్ కంపెనీని స్థాపించి మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్నారు. TV9 ఛానెల్ కొనుగోలు చేసి టెలివిజన్ ఛానెల్ యజమానిగా పేరుపొందారు. ఒక బిలియన్ డాలర్ల ఆస్తుల అధినేతగా ఉన్నారు. ఈయన మైహోం రామేశ్వర్ రావుగా పేరుపొందారు.

ఈయన శ్రీశ్రీశ్రీ త్రిడండి చినజీయర్ స్వామి భక్తుడు మరియు సన్నిహితుడు. ఈయన అధీనంలోని మహాసిమెంట్ కంపెనీకి సూర్యాపేటతో సహా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులలో 4 ప్లాంట్లు ఉన్నాయి. శంషాబాదు (రంగారెడ్డి జిల్లా) వద్ద హోమియో ఆసుపత్రి నిర్మించి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. 2016 లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డు పొందారు (మార్కెటింగ్ రంగంలో-గోల్డెన్ గ్లోబల్ ఏజెన్సీ-కౌలాలంపూర్‌చే). 2016లోనే ఉత్తమ రియల్ ఎస్టేట్ కన్‌స్ట్రక్శన్ కంపెనీగా  (హైదరాబాదులో) జూపల్లికి చెందిన మై హోం ఎంపికైంది.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రముఖులు, కొల్లాపూర్ మండలం, తెలంగాణ పారిశ్రామికవేత్తలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి