శంషాబాదు రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాదులో ఉంది. మండలంలో 24 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 43 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖ నవలా రచయిత్రి మాదిరెడ్డి సులోచన, విమోచనోద్యమకారుడు మామిడి భోజిరెడ్డి ఈ మండలానికి చెందినవారు. అమ్మపల్లిలో క్రీ.శ.11వ శతాబ్దిలో చాళుక్యుల కాలంలో నిర్మించబడిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది. నానాజీపూర్ వద్ద జలపాతం ఉంది. సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మొయినాబాదు మండలం మరియు రాజేంద్రనగర్ మండలం, తూర్పున బాలాపూర్ మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన మహేశ్వరం మండలం, పశ్చిమాన కొత్తూరు మండలం మరియు షాబాద్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 72292. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 87637. ఇందులో పురుషులు 45070, మహిళలు 42567. అక్షరాస్యుల సంఖ్య 51456. పట్టణ జనాభా 35000, గ్రామీణ జనాభా 52637. హిమాయత్ సాగర్: హిమాయత్ సాగర్ జలాశయం ఈసీవాగుపై ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు. హైదరాబాదును వరదనీటి నుంచి రక్షించుట మరియు తాగునీటి కొరకు నిజాం ప్రభుత్వం 1920-27 కాలంలో నిర్మించబడింది. జలాశయానికి 17 గేట్లు అమర్చబడియున్నాయి. ఎగువప్రాంతంలోని పెరిగి, చేవెళ్ళ, మొయినాబాదు, శంషాబాదు, షాబాదు ప్రాంతాల్లోని వరదనీరు ఇందులోకి వస్తుంది. మండలంలోని గ్రామాలు: Ammapally, Bahadurguda, Cherlaguda, Chowderguda, Devatabowli, Gandiguda, Ghansimiaguda, Golkonda Kalan, Golkonda Khurd, Gollapalle Kalan, Gollapalle Khurd, Hamidullanagar, Hariguda, Jukal, Kacharam, Kaveliguda, Kishanguda, Kolbowidoddi, Kothwalguda, Langerguda, Madanpalli, Malkaram, Maqtabahadur Ali, Muchintal, Nanajpur, Narkhuda, Ootpalli, Palmakole, Pashambanda, Peddashapur, Peddatopra, Posettyguda, Ramanujapur, Rasheedguda, Rayannaguda, Sanghiguda, Satamrai, Sayyed Guda, Shahajadibegum, Shamshabad (P), Shankarapur, Sultanpalli, Tondpalli
ప్రముఖ గ్రామాలు:
అమ్మపల్లి (Ammapalli):అమ్మపల్లి రంగారెడ్డి జిల్లా శంషాబాదు మండలమునకు చెందిన గ్రామము. ఇది మండల కేంద్రం శంషాబాద్ నుంచి 5 కిమీ దూరంలో ఉంది. గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 11వ శతాబ్దిలో చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. నానాజీపూర్ (Nanajipur) : నానాజీపూర్ రంగారెడ్డి జిల్లా శంషాబాదు మండలానికి చెందిన గ్రామము. గ్రామం వద్ద జలపాతం ఉంది. ఇది నానాజీపూర్ జలపాతంగా ప్రసిద్ధిచెందింది. శంషాబాదు (Shamshabad): శంషాబాద్ రంగారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాదులోనే ఉంది. ప్రముఖ నవలా రచయిత్రి మాదిరెడ్డి సులోచన, విమోచనోద్యమకారుడు మామిడి భోజిరెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. ఇది కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Shamshabad Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Rajiv Gandhi International Airport in Shamshabad, Hyderabad, mandals in Telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి