జర్నలిస్టుగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన బూటాసింగ్ మార్చి 21, 1934న ముస్తాఫాపూర్ (జలంధర్ జిల్లా, పంజాబ్)లో జన్మించారు. ప్రారంభంలో అకాలీదళ్ నుంచి పోటీచేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టిలో చేరిన బూటాసింగ్ తన సుధీర్ఘ 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడిగా పేరుపొందారు. 8 సార్లు లోక్‌సభకు ఎన్నిక కావడమే కాకుండా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాలలో హోంశాఖతో పాటు పలు కీలక మంత్రిత్వశాఖలను నిర్వర్తించారు. రెండేళ్ళపాటు బీహార్ గవర్నరుగా కూడా పనిచేశారు. బూటాసింగ్ Punjabi Speaking State - A Critical Analysis గ్రంథాన్ని రచించారు. జనవరి 2, 2021న బూటాసింగ్ మరణించారు. కుమారుడు అరవింద్ సింగ్ లవ్లీ కూడా రాజకీయ నాయకుడిగా (భాజపా తరఫున) పేరుపొందారు
రాజకీయ ప్రస్థానం: ప్రారంభంలో జర్నలిస్టుగా జీవనం ప్రారంభించిన బూటాసింగ్ జవహర్‌లాల్ నెహ్రూ కాలంలోనే 1962లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైనారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో 1999 వరకు మొత్తం 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1974లో తొలిసారిగా ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా స్థానం పొంది ఆ తర్వాత ఇందిర, రాజీవ్ మంత్రివర్గాలలో హోంశాకతో పాటు పలు కీలక మంత్రిత్వశాఖలను నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీ చీలిక తర్వాత పార్టీ చిహ్నంకై ఇందిర బూటాసింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. 1978-80 కాలంలో ఆలిండియా కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల సమయంలో ఆసియాక్రీడల స్పెషల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మెన్‌గా వ్యవహరించారు. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు జె.ఎం.ఎం.ముడుపుల కేసు వల్ల 1989లో రాజీనామా చేయవల్సి వచ్చింది. 2004-06 కాలంలో బీహార్ గవర్నరుగా పనిచేశారు. 200లో బీహార్ శాసనసభ రద్దుచేయడం, ఆ తర్వాత ఈ చర్యపై సుర్పీంకోర్టు తప్పుపట్తడంతో గవర్నర్ పదవికి రాజీనామా సమర్పించరు. 2007-10 కాలంలో జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మెన్‌గా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి