1, జనవరి 2021, శుక్రవారం

ఉమా భారతి (Uma Bharti)

జననం
మే 3, 1959
రంగం
రాజకీయాలు, సాధ్వి,
పదవులు
కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి,
రాజకీయ నాయకురాలిగా, హిందూ సాధ్విగా, హిందుత్వ ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొందిన ఉమాభారతి మే 3, 1959మధ్యప్రదేశ్‌లోని టికాంగఢ్ జిల్లా దుండాలో జన్మించారు. చిన్నవయస్సులోనే హిందుత్వ భావాలతో ఉన్న ఉమాభారతి విజయరాజె సింధియా ప్రోత్సాహంతో భాజపాలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ఉన్నత పదవులు పొందారు.

రాజకీయ ప్రస్థానం:
తొలిసారిగా 1984లో ఖజురాహో నుంచి లోక్‌సభ పోటీచేసిననూ ఇందిరగాంధీ హత్యతో సానుభూతి పవనాలు వీచడంతో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయారు. ఎల్.కె.అద్వానీకి సన్నిహితంగా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. రామజన్మభూమి వివాదంలో లిబర్‌హన్ కమీషన్ చే అభియోగం కూడా మోపబడ్డారు. 1991లో ఉమాభారతి భోపాల్ నుంచి నుంచి గెలుపొంది అటల్ బిహారి వాజపేయి మంత్రివర్గంలో చోటు సంపాదించింది. 2003 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భాజపాకు నాయకత్వం వహించి విజయం సాధించి పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. 1994 హుబ్లీకేసులో అరెస్ట్ వారెంట్ రావడంతో 2004లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో ఎల్.కె.అద్వానీ పై విమర్శలు చేసి భాజపా నుంచి సస్పెండ్ అయ్యారు. 2006లో ప్రత్యేకంగా భారతీయ జనశక్తి పార్టీ స్థాపించిననూ ఎలాంటి ప్రభావం చూపనందున 2011లో మళ్ళీ భాజపాలో ప్రవేశించారు. ఝాన్సీ నుంచి గెలుపొంది 2014-19 కాలంలో నరేంద్రమోడి మంత్రివర్గంలో పనిచేశారు. 2019లో పోటీచేయలేరు. 2019-20లో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు, మధ్యప్రదేశ్ ప్రముఖులు, ప్రముఖ భారతీయ మహిళలు, ప్రముఖ భారతదేశ రాజకీయ నాయకులు, 1959లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి