1, జనవరి 2021, శుక్రవారం

చౌడాపూర్ మండలం (Chowdapur Mandal) :

చౌడాపూర్ మండలం
(ప్రతిపాదిత)
జిల్లా
వికారాబాదు జిల్లా
రెవెన్యూ డివిజన్
వికారాబాదు
రెవెన్యూ గ్రామాలు
14
మండల అవతరణ
తుది ప్రకటన రావాల్సి ఉంది
చౌడాపుర్ వికారాబాదు జిల్లాకు చెందిన ప్రతిపాదిత మండలము. డిసెంబరు 31, 2020న ఈ మండలం ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక ప్రకటన జారీఅయింది. కుల్కచర్ల మండలంలోని 7 రెవెన్యూ గ్రామాలు మరియు మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని 7 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన జారిచేయబడింది. 
 
30 రోజుల వ్యవధిలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది ప్రకటన వెలువడుతుంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న ప్రతిపాదిత గ్రామాలు 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కుల్కచర్ల (అప్పుడు రంగారెడ్డి జిల్లా)లో భాగంగా ఉండేవి.
 
ఈ మండలంలోని గ్రామాలు పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.


ప్రతిపాదన రెవెన్యూ గ్రామాలు:
ముక్తి వెంకటాపూర్, లింగంపల్లి, మందిపల్లి, విఠలాపూర్, వీరాపూర్, చౌడాపూర్, అడవి వెంకటాపూర్ (ఇవి ప్రస్తుతం కుల్కచర్ల మండలంలో ఉన్నాయి)
మరికల్, కమ్మన్‌కాల్వ, కొత్తపల్లి, మల్కాపూర్, చాకల్‌పల్లి, ముగుళ్లపల్లి, పుర్సంపల్లి (ఇవి ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఉన్నాయి)
 
 మండలంలోని ప్రముఖ గ్రామాలు:
చౌడాపూర్ (Chowdapur) :
చౌడాపూర్ వికారాబాదు జిల్లా కుల్కచర్ల మండలమునకు చెందిన గ్రామము. చౌడాపూర్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు డిసెంబరు 31, 2020న ప్రాథమిక ప్రకటన వెలువడింది. తుది ప్రకటన వెలువడిన పిదప ఈ గ్రామం మండలకేంద్రంగా మారుతుంది. గ్రామ జనాభా సుమారు 3000. 
కమ్మన్‌కల్వ (Kammankalwa) :
కమ్మన్‌కల్వ మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. గ్రామానికి సమీపంలో 3 చెరువులున్నాయి. ముదిరాజ్ కులస్థులు అధికంగా ఉన్నారు. గ్రామ జనాభా సుమారు 2వేలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2016కు ముందు  గ్రామం కుల్కచర్ల మండలంలో ఉండగా అక్టోబరు 11, 2016న మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో కలిసింది. డిసెంబరు 31, 2020 నాటి ప్రాథమిక ప్రకటన ప్రకారం ఈ గ్రామం వికారాబాదు జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేయనున్న చౌడాపూర్ మండలంలో కలుస్తుంది.
హోం
విభాగాలు: వికారాబాదు జిల్లా మండలాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి