1, మే 2013, బుధవారం

మంజీర నది (Manjira River)

మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాలలో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటకల గుండా ప్రవహించి గౌడ్‌గావ్ వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది. తెలంగాణలో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాదు జిల్లాల గుండా ప్రవహించి కందకుర్తి వద్ద గోదావరినదిలో కలుస్తుంది. మంజీరనది పూర్వం గరుడగంగ పేరుతో ప్రసిద్ధి చెందింది.  సుమారు 30800 చకిమీ పరీవాహ ప్రాంతం కలిగిన ఈ నదిపై నిజాం సాగర్ ప్రాజెక్, సింగూరు ప్రాజెక్టు నిర్మించబడింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాదు జిల్లాలలో పంటపొలాలకు నీటిపారుదల కలిగించడమే కాకుండా పలు పట్టణాలు, గ్రామాల ప్రజలకు తాగునీటిని కూడా ఈ నది అందిస్తుంది. హైదరాబాదు నగరానికి త్రాగునీటిని కలిగించే సింగూరు రిజర్వాయర్ కూడా ఈ నదిపైనే నిర్మించబడింది. 2010 మేలో దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మంజీరనదికి కుంభమేళ నిర్వహించారు. 2013 మే 2న మరోసారి కుంభమేళ నిర్వహించారు. మెదక్ జిల్లా న్యాలకల్ మండలం రాఘవాపూర్ గ్రామశివారులోని పంచవటి క్షేత్రం ఈ కుంభమేళకై ఎంపికచేశారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న పంచవటి క్షేత్రాన్ని 2006లో ప్రముఖ గురువు కాశీనాథ్ బాబా స్థాపించారు.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: తెలంగాణ నదులు, గోదావరి నది, మెదక్ జిల్లా, నిజామాబాదు జిల్లా, కామారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా,

5 కామెంట్‌లు: