దక్షిణ భారతదేశంలో పశ్చిమాన అరేబియా సముద్రతీరాన ఉన్న మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగర్ హవేలి తోనూ సరిహద్దులున్నాయి. ప్రపంచంలోనే ప్రముఖ నగరాలలో ఒకటిగా పేరుపొంది, దేశ ఆర్థిక రాజధానిగా పరిగణించబడుతున్న ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని. మహారాష్ట్ర 3,07,710 చ.కి.మీ. వైశాల్యంతో దేశంలో మూడవ పెద్ద రాష్ట్రంగా, 11.2 కోట్ల జనాభాతో రెండో అత్యధిక జనాభా కల రాష్ట్రంగా ఉంది. ముంబాయి రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ రాష్ట్రం 1960లో గుజరాత్ విడిపోయి మిగిలిన మరాఠి భాష మాట్లాడే ప్రాంతం ప్రస్తుత మహారాష్ట్రగా ఏర్పడింది. శాతవాహన సామ్రాజ్యం మరియు మరాఠా సామ్రాజ్యాలు చరిత్రలో ఈ ప్రాంతంలో పాలించబడిన ప్రముఖ సామ్రాజ్యాలు. రాష్ట్రంలో 48 లోకసభ స్థానాలు, 288 అసెంబ్లీ స్థానాలు, 78 విధానసభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్ర అధికార భాష మరాఠి. అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, గోపాల కృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, అమితాబ్ బచ్చన్, బాబాఆమ్టే, డి.కె.కార్వే, వి.డి.సావర్కార్, అన్నాహజారే, జ్యోతిబాఫూలే, సావిత్రిబాయి ఫూలె, లాంటి ప్రముఖులు ఈ రాష్ట్రానికి చెందినవారు. భౌగోళికం, సరిహద్దులు: దక్షిణ భారతదేశంలో పశ్చిమాన అరేబియా సముద్ర తీరంలో 720 కిలోమీటర్ల తీరరేఖను కలిగియుంది. పశ్చిమాన పడమటి కొండలు, ఉత్తరాన సాత్పూరా పర్వాతాలు విస్తరించియున్నాయి. ఉత్తరాన గుజరాత్, ఈశాన్యాన మధ్యప్రదేశ్, తూర్పున ఛత్తీస్‌ఘర్, ఆనేయాన తెలంగాణ, దక్షిణాన కర్ణాటక మరియు గోవా రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్రంలో 36 జిల్లాలు కలవు.
మహారాష్ట్ర గురించి క్రీ.పూ. 3వ శతాబ్దమునాటి లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్నాయి. అశోకుడు పాలించిన మగధ సామ్రాజ్యంలో మహారాష్ట్ర ఒక భాగంగా ఉండేది. మౌర్యసామ్రాజ్యం పతనానంతరం శాతవాహనసామ్రాజ్యంలో భాగమయ్యింది. ఆ తర్వాత వాకాటకులు విదర్భ ప్రాంతాన్ని పాలించారు. 6వ శతాబ్ద కాలంలో మహారాష్ట్ర ప్రాంతమును బాదామి చాళుక్యులు, 8వ శతాబ్దిలో రాష్ట్రకూటులు పాలించారు. రాష్ట్రకూటులను ఓడించి బాదామి చాళుక్యులు 973-1189మధ్య మహారాష్ట్రలో కొంతభాగాన్ని పాలించారు. 1189 తరువాత దేవగిరి యాదవులు ఇక్కడి రాజులయ్యారు. క్రీ.శ.13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకొన్నారు. 1347లో తుగ్లక్‌ల రాజ్యం పతనమయినాక బీజాపూర్‌కు చెందిన బహమనీ సుల్తానులు తరువాత 150 సంవత్సరాలు ఇక్కడ రాజ్యం నెరపారు. 16వ శతాబ్దంలో తీరప్రాంతంలో పోర్చుగీసువారు అధికారం చేజిక్కించుకున్నారు. 17వ శతాబ్దారంభంలో స్థానికులైన మరాఠాల నాయకత్వంలో మరాఠా సామ్రాజ్యం కొనసాగింది. 1761లో మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠాలు దారుణంగా పరాజితులయ్యారు. 18వ శతాబ్దిలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మరాఠాలకు యుద్ధాలు మొదలయ్యాయి. 1819 నాటికి మహారాష్ట్రలో పేష్వాల పాలనలో ఉన్న భూభాగం ఆంగ్లేయుల పరమైంది. బ్రిటిష్‌వారు ఈ ప్రాంతాన్ని బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా పాలించారు. మరాఠ్వాడా ప్రాంతం హైదరాబాద్ నిజాం రాష్ట్రంలో భాగంగా ఉండేది. 20వ శతాబ్దం ఆరంభంలో భారత స్వాతంత్ర్య పోరాటం వ్రేళ్ళూనుకొంది. 1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. జనాభా: 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 11,23,74,333. ఇది దేశ జనాభాలో 9.28%. దేశంలో అత్యధిక జనాభా కల రాష్ట్రాలలో మహారాష్ట్ర రెండోస్థానంలో ఉంది. 2001లో 9.67 కొట్లు ఉన్న్ అజనాభా దశాబ్ద కాలంలో 16.1% పెర్గింది.
దేశంలోనే అత్యధికంగా 3,688 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు మహారాష్ట్రలో ఉన్నాయి. ముంబాయి నుంచి పూణె వరకు ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే తొలి ఎక్స్‌ప్రెస్‌వే మార్గము. ముంబాయి మధ్యరైల్వే మరియు పశ్చిమ రైల్వే జోన్లకు కేంద్రస్థానంగా ఉంది. దేశంలోనే తొలి రైలు మార్గం ఈ రాష్ట్రంలోనే ప్రారంభమైంది. ముంబాయిలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నాగ్పూర్, పూనె, షోలాపూర్, ఔరంగాబాదు, లాతూర్, నాందేడ్ తదితరప నగరాలలో విమానాశ్రయాలు ఉన్నాయి.
స్వాతంత్ర్యానంతరం చాలాకాలం వరకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం నిలుపుకుంది. అవిభక్త ముంబాయి రాష్ట్రానికి మురార్జీదేశాయి, 1960 తర్వాత యశ్వంత్ రావ్ చవాన్, వసంత్‌రావ్ నాయక్, శంకర్‌రాచ్ చవాన్, వసంత్ దాదా పాటిల్ సుధీర్ఘకాలం పాలించారు. 1978లో తొలిసారిగా కాంగ్రెసేతర పార్టీకి చెందిన శరద్ పవార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1980 నుంచి 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతూలే, వసంత్‌దాదా పాటిల్, శంకర్‌రావ్ చవాన్, శరద్ పవార్ తదితరులు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1995లో ప్రాంతీయపార్టీ అయిన శివసేనకు చెందిన మనోహర్ జోషి, నారాయన్ రాణె నాలుగేళ్ళు పాలించగా 1999 నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రెండు విడతలు కలిపి ఏడేళ్ళకు పైగా ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు. 15 సంవత్సరాల అనంతరం 2014 ఎన్నికలలో భాజపా అతిపెద్ద పార్టిగా అవతరించగా, శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. క్రీడలు: మహారాష్ట్రలో ప్రజాదరణ కలిగిన క్రీడ క్రికెట్. ప్రముఖ క్రికెట్ క్రీడాకారులు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, దులీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, బాపూ నాదకర్ణి, చందూబోర్డె, దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, వినోద్ కాంబ్లి, విజయ్ హజారే ఈ రాష్ట్రానికి చెందినవారు. ముంబాయిలోని వాంఖేడే స్టేడియం దేశంలోని ప్రముఖ క్రికెట్ స్టేడియాలలో ఒకటి. 2011 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఇక్కడే నిర్వహించబడింది. కబడ్డి, ఖోఖో కూడా ఈ రాష్ట్రపు ఇతర ముఖ్య క్రీడలు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
26, ఆగస్టు 2014, మంగళవారం
మహారాష్ట్ర (Maharashtra)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి