కామారెడ్డి జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు ఉన్నాయి. 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న కామారెడ్డి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నిజామాబాదు జిల్లాలోనివే. సికింద్రాబాదు - నిజామాబాదు రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. హాస్యనటుడు వెన్నెల కిశోర్ కామారెడ్డి జిల్లాకు చెందినవారు.
సరిహద్దులు: ఈ జిల్లాకు తూర్పున కరీంనగర్ జిల్లా, ఉత్తరాన నిజామాబాదు జిల్లా, దక్షిణాన మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉంటాయి. మండలాలు: కామారెడ్డి, భిక్నూర్, తాడ్వాయి, రాజంపేట్, దోమకొండ, బీబీపేట్, మాచారెడ్డి, సదాశివనగర్, రామారెడ్డి, బాన్సువాడ, బిర్కూర్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం, పెద్ద కొడప్గల్, మద్నూర్, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, గాంధారి. ఇవి కూడా చూడండి:
= = = = =
ఆధారాలు:
|
Tags: News Districts in telangana, Kamareddy Dist in Telugu
Tags: About Kamareddy Dist
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి