17, డిసెంబర్ 2013, మంగళవారం

ఆమనగల్ (Amangal)

ఆమనగల్ గ్రామము
గ్రామముఆమనగల్ 
మండలముఆమనగల్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా20467 (2001)
23882 (2011)
ఆమనగల్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. శ్రీ వెంకటేశ్వర, శ్రీనివాస సినిమా థియేటర్లున్నాయి. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన తల్లోజు ఆచారి ఈ గ్రామమునకు చెందినవారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20467. ఇందులో పురుషులు 10597, మహిళలు 9870. గృహాల సంఖ్య 4094.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 23882. ఇందులో పురుషులు 12236, మహిళలు 1146. గృహాల సంఖ్య 5269. అక్షరాస్యత శాతం 54.90%. గ్రామ కోడ్ సంఖ్య 575289.

తల్లోజు ఆచారి
రాజకీయాలు:
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన తల్లోజు ఆచారి 1996-2001 కాలంలో సర్పంచిగా పనిచేశారు. 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా గుర్రం కరుణశ్రీ ఎన్నికయ్యారు.

అధ్యాత్మికం:
శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీవసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉంది.


విభాగాలు: ఆమనగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి