చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలైన గల్లా అరుణకుమారి 1943లో దిగువమాఘంలో జన్మించారు. తిరుపతి స్వస్థలానికి చెందిన అరుణకుమారి చికాగోలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. భర్త గల్లా రామచంద్రనాయుడు అమరరాజా సంస్థల చైర్మెన్. తండ్రి రాజగోపాలనాయుడు కూడా రాజకీయనాయకుడు.
రాజకీయ ప్రస్థానం: భర్తతో పాటు అమెరికాలో ఉంటున్న గల్లా అరుణకుమారి 1984లో భారత్ వచ్చారు. 1985లో పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిననూ లభించలేదు. అరుణకుమారి 1989లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1994లో ఓటమి చెందిననూ 1999, 2004, 2009లలో వరస విజయాలు సాధించారు. 2007లో వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం పొందినారు. 2009లో మరోసారి చంద్రగిరి నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీకి చెందిన రోజాపై విజయం సాధించారు. 13వ శాసనసభ కాలంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాలలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అరుణకుమారి 2014. మార్చి 8న తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈమె కుమారుడు గల్లా జయదేవ్ 2014 మరియు 2019లలో తెలుగుదేశం పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైనారు. ఇవి కూడా చూడండి:
(ఇక్కడి సమాచారం తేది 02-05-2020 నాటికి తాజాకరించబడింది)
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి