ప్రముఖ సినీనటిగా, రాజకీయ నాయకురాలిగా పేరుపొందిన రోజా నవంబరు 17, 1972 న చిత్తూరు జిల్లా భాకరాపేట్ (తిరుపతి సమీపంలో) జన్మించారు. రోజా అసలుపేరు శ్రీలతారెడ్డి. తమిళ, తెలుగు, కన్నడ, మళయాల భాషలలో 150 పైగా సినిమాలలో నటించిన రోజా 3 సార్లు ఉత్తమనటిగా నంది అవార్డులు పొందారు. 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి ప్రస్తుతం వైకాపా తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. భర్త ఆర్.కె.సెల్వమణి సినీదర్శకుడీగా పేరుపొందారు. ఈటీవిలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడి సీరియల్‌లో న్యాయనిర్ణేత (జడ్జి)గా వ్యవహరిస్తున్నారు.
సినీప్రస్థానం: తెలుగు సినిమా ద్వారా సినీప్రస్థానం ప్రారంభించిన రోజా నటించిన తొలి సినిమా ప్రేమతపస్సు. 1991-2002 కాలంలో దక్షిణ భారతదేశంలోనే రోజా అగ్రగణ్య నటిగా రాణించారు. అన్నా (1994), స్వర్ణక్క (1998), శ్రీరామరాజ్యం (2011) సినిమాలలో నటనకుగాను నంది అవార్డులు పొందారు. రోజా తమిళంలో తొలిసారిగా సెల్వమణి దర్శకత్వంలోని చంబరతి సినిమాలో నటించింది. దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని వివాహం చేసుకుంది. రాజకీయ ప్రస్థానం: 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశ్ం చేసిన రోజా పార్టీ మహిళా విభాగం "తెలుగు మహిళ" అధ్యక్షురాలిగా పనిచేశారు. 2004, 2009లలో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి గల్లా అరుణ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైకాపాలో చేరి 2014లో నగరి నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2019లో నగరి నుంచి పోటీచేసి రెండోసారి విజయం సాధించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
11, జూన్ 2019, మంగళవారం
రోజా సెల్వమణి (Roja Selvamani)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి