11, డిసెంబర్ 2013, బుధవారం

కొత్తూరు (Kothur)

 కొత్తూరు గ్రామము
గ్రామముకొత్తూరు 
మండలముకొత్తూరు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా6863 (2001),
10519 (2011)
కొత్తూరు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10519. జనాభా లెక్కల ప్రకారం ఇది పట్టణ ప్రాంతంగా గుర్తింపు పొందింది. గ్రామంలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. కొత్తూరులో రైల్వేస్టేషన్ కూడా ఉంది. 2014, నవంబరు 8న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆసరా పథకాన్ని (ఫింఛన్ల పథకం) ఈ గ్రామంలోనే ప్రారంభించారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6863. ఇందులో పురుషులు 3766, మహిళలు 3097. గృహాల సంఖ్య 1525.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10519. ఇందులో పురుషులు 5635, మహిళలు 4884. గృహాల సంఖ్య 2525. అక్షరాస్యత శాతం 65.80%. గ్రామ కోడ్ సంఖ్య 575227. జనాభా లెక్కల ప్రకారం ఇది పట్టణ ప్రాంతంగా గుర్తింపు పొందింది.

2009 సర్పంచి ఎన్నికలు:
2009అక్టోబరులో జరిగిన సర్పంచి ఎన్నికలలో సుదర్శన్ గౌడ్ విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 4670 ఓటర్లు ఉండగా 3861 ఓట్లు పోలయ్యాయి. సుదర్శన్ గౌడ్‌కు 2568 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి కడెంపల్లి శ్రీనివాస్‌కు 1188 ఓట్లు వచ్చాయి. సుదర్శన్ గౌడ్ 1380 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

కాలరేఖ:
2014, నవంబరు 8: ముఖ్యమంత్రి కేసిఆర్ ఆసరా పథకాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించారు.


విభాగాలు: కొత్తూరు మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి