1, ఆగస్టు 2018, బుధవారం

చిల్కూరు మండలం (Chilkur Mandal)

చిల్కూరు మండలం
జిల్లా సూర్యాపేట
రెవెన్యూ డివిజన్ కోదాడ
అసెంబ్లీ నియోజకవర్గంకోదాడ
లోకసభ నియోజకవర్గంనల్గొండ
చిల్కూరు సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 4 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజన్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగము. 1941లో మండలకేంద్రం చిల్కూరులో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రమహాసభలు జరిగాయి.

భౌగోళికం, సరిహద్దులు:
మండలానికి తూర్పున కోదాడ మండలం, దక్షిణాన హుజూర్‌నగర్ మండలం, పశ్చిమాన గరిడేపల్లి మండలం, ఉత్తరాన మునగాల మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 37770, 2011 నాటికి జనాభా 1456 పెరిగి 39226 కు చేరింది. ఇందులో పురుషులు 19737, మహిళలు 19489.

రాజకీయాలు:
ఈ మండలము కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
బేతవోలు, చిల్కూరు, కొండాపురం, పాలె అన్నారం

ప్రముఖ గ్రామాలు
చిలుకూరు (Chilkur):
1941లో చిలకూరులో 8వ ఆంధ్రమహాసభ జరిగింది. ఈ సభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. నిజాం విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన కస్తూరి అప్పన్న ఈ గ్రామస్థుడు.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


విభాగాలు: సూర్యాపేట  జిల్లా మండలాలు,  అనంతగిరి మండలము, కోదాడ రెవెన్యూ డివిజన్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 246 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Nizam Andhra Mahasabha, Chilkur Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి