తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో నల్గొండ జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి.
2019లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ సురవరం సుధాకర రెడ్డిపై 1,52,982 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సుఖేందర్ రెడ్డికి 493849 ఓట్లు రాగా, సుధాకర్ రెడ్డికి 340867 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పి.కరుణ 3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వి.శ్రీరాంరెడ్డి 4వ స్థానంలో నిలిచారు.
2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 11 అభ్యర్థులు నామినేషన్లు వేయగా 2 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. తుదిబరిలో 9 అభ్యర్థులు మిగిలారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, గుత్తా సుఖేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన రాజేశ్వర్ రెడ్డిపై 194056 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2019 ఎన్నికలు: 2019లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, హుజూర్‌నగర్ సిటింగ్ ఎమ్మెల్యే అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25682 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 526028 ఓట్లు రాగా, తెరాస అభ్యర్థికి 500346 ఓట్లు లభించాయి.
= = = = =
|
15, జూన్ 2013, శనివారం
నల్గొండ లోకసభ నియోజకవర్గం (Nalgonda Loksabha Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి