23, జూన్ 2020, మంగళవారం

పశ్చిమబెంగాల్ (West Bengal)

రాజధాని
కోల్‌కత
వైశాల్యం
88,752 చకిమీ
జనాభా 9.13 కోట్లు
అధికారభాష
బెంగాలీ
పశ్చిమబెంగాల్ భారతదేశ తూర్పు భాగంలోని రాష్ట్రము. వైశాల్యంలో దేశంలో 13వ పెద్ద మరియు జనాభాలో 4వ పెద్ద రాష్ట్రము. రాష్ట్ర రాజధాని కోల్‌కత, అధికార భాష బెంగాలీ. తూర్పువైపు బంగ్లాదేశ్ సరిహద్దును కలిగిన పశ్చిమబెంగాల్ ఉత్తరాన నేపాల్, భూటాన్ దేశ సరిహద్దులను కూడా కల్గియుంది. విశాలమైన గంగా డెల్టా, డార్జిలింగ్ పర్వతప్రాంతం, సుందర్బాన్స్ మడ అడవులను కల్గిన ఈ రాష్ట్రంలో ప్రధానపట్టణాలు కోల్‌కత, హౌరా, అసన్‌సోల్, సిలిగురి, దుర్గాపూర్. నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, సమరయోధుడు ఖుదీరాంబోస్, రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ, రచయిత తారాశంకర్ బందోపాధ్యాయ, సినీప్రముఖుడు సత్యజిత్ రాయ్ ఈ రాష్ట్రానికి చెందినవారు. దుర్గాపూజ ఈ రాష్ట్రపు ప్రధాన ఉత్సవం.

భౌగోళికం, సరిహద్దులు:
భారతదేశ తూర్పు భాగంలో ఉన్న పశ్చిమబెంగాల్ తూర్పున బంగ్లాదేశ్, ఉత్తరాన నేపాల్, భూటాన్ దేశాల సరిహద్దులను, పశ్చిమాన బీహార్, ఝార్ఖండ్, నైరుతిన ఒడిషా, ఈశాన్యాన అస్సాం రాష్ట్రాల సరిహద్దులను కల్గియుంది. 88,752 చకిమీ వైశాల్యంతో దేశంలో 13వ స్థానంలో, 9.13 కోట్ల జనాభాతో 4వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో పెద్ద నగరం కోల్‌కత.

చరిత్ర:
జనపదాల కాలంలో ఈ ప్రాంతంలో పలు జనపదాలు వర్థిల్లాయి. మౌర్య, గుప్త సామ్రాజ్యాలలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. క్రీ.శ.8వ శతాబ్ది నాటి పాల సామ్రాజ్యం ఈ ప్రాంతపు ప్రత్యేకత. 14వ శతాబ్దిలో సుల్తానుల పాలన ప్రారంభమైంది. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వారి కాలంలో 1757 నాటి ప్లాసి యుద్ధం పరిస్థితిని మార్చివేసింది. క్రమక్రమంగా బెంగాల్ బ్రిటీష్ వారి అధీనంలోకి వెళ్ళి 1911 వరకు కలకత్తా (కోల్‌కత) భారతదేశ రాజధానిగా పనిచేసింది. స్వాతంత్ర్యోద్యమం ఈ ప్రాంతంలో బాగా నడిచింది. దేశవిభజన సమయంలో బెంగాల్ రెండు ముక్కలై తూర్పు భాగం పాకిస్తాన్‌కు (ప్రస్తుత బంగ్లాదేశ్) వెళ్ళగా మిగిలిందే ప్రస్తుత పశ్చిమ బెంగాల్.

ఆర్థికం:
స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్ దేశంలో 6వ స్థానంలో ఉంది. వరి, జనపనార, చెరకు ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు. టీ ఉత్పత్తిలో డార్జిలింగ్ ప్రాంతం దేశంలోనే ప్రఖ్యాతిచెందింది. కోల్‌కత, దుర్గాపూర్, హాల్దియా ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొనియున్నాయి.

క్రీడలు:

క్రికెట్ మరియు ఫుట్‌బాల్ ఈ రాష్ట్రపు ప్రజాదరణ కల్గిన క్రీడలు. భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడకు పశ్చిమబెంగాల్ కేంద్రస్థానం. దేశంలో ప్రసిద్ధిచెందిన మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ క్లబ్ ఫుట్‌బాల్ జట్లు ఈ రాష్ట్రానికి చెందినవి. 1987 ప్రప్ంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కోల్‌కతలో నిర్వహించబడింది. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ అయిన కోల్‌కత నైట్ రైడర్స్ ఇక్కడిదే.సౌరవ్ గంగీలీ, అరుణ్ లాల్, ఝులన్ గోస్వామి, చుని గోస్వామి, లియాండర్ పేస్, మిహిర్ సేన్, జ్యోతిర్మయి సిక్దర్, దీపా కర్మాకర్ ఈ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులు.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: భారతదేశ రాష్త్రాలు, పశ్చిమబెంగాల్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక