21, ఆగస్టు 2020, శుక్రవారం

ఉస్మానియా విశ్వవిద్యాలయము (Osmania University)

ఉస్మానియా విశ్వవిద్యాలయము
నగరం
హైదరాబాదు
స్థాపన
1918-19
తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఉంది. ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ కాలంలో 1917లో ఉత్తర్వులు వెలువడగా 1918-19లో అధికారికంగా ప్రారంభించబడిన ఈ విశ్వవిద్యాలయం దేశ భాషను బోధనా భాషగా ప్రవేశపెట్టిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. తరగతులు మొదటి ఆబిడ్స్‌లో ప్రారంభించగా, ఆ తర్వాత 1939లో ప్రస్తుత ప్రాంతంలో మొదట ఆర్ట్స్ కాలేజి భవనం నిర్మించబడింది.

1938లో విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం జరిగింది. ఉద్యమంలో పాల్గొన్న వందలాది విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. వీరిలో ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింగారావు తదితరులున్నారు. ప్రారంభంలో బోధనాభాష ఉర్దూ ఉండగా హైదరాబాదు విమోచన అనంతరం భారత యూనియన్‌లో చేరిన పిదప ఇంగ్లీష్‌ను బోధనాభాషగా ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం విశ్వవిద్యాలయం క్యాంపస్ విశాలమైన ప్రాంతాన్ని కలిగి ఒకో విభాగానికి ఒక్కో ప్రత్యేక భవనాన్ని కలిగియుంది. ఎత్తయిన ప్రాంతంలో గ్రంథాలయ భవనం ప్రత్యేకంగా నిర్మించబడి ఉంది. క్యాంపస్ మధ్యనుంచి విద్యానగర్-తార్నాకా రహదారి వెళ్ళుతుంది. క్యాంపస్‌లో 5 బస్ స్టాపులు కలవు.

1969లో జరిగిన ప్రత్యేక తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ, 2014లో తెలంగాణ అవతరణకు ముందు జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు పూర్తిగా సహకరించారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు.
ఆర్ట్స్ కాలేజి


ఈ విశ్వవిద్యాలయంలో అభ్యసించిన ఎందరో ప్రముఖ పదవులు పొందారు. ప్రధానమంత్రిగా పదవి పొందిన పి.వి.నరసింహారావు, కేంద్రమంత్రిగా, మహారాష్ట్ర గవర్నరుగా పనిచేసిన సీహెచ్ విద్యాసాగర్ రావు, కేంద్రమంత్రిగా పనిచేసిన సూదిని జైపాల్ రెడ్డి, రాజకీయ నాయకుడు శివరాజ్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అడోబ్ సీఈఓగా ఉన్న శంతను నారాయణ్, క్రికెట్ క్రీడాకారుడు అజహరుద్దీన్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షభోగ్లే, రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన వై.వేణుగోపాల్ రెడ్డి ఈ విశ్వవిద్యాలయంలో అభ్యసించిన ప్రముఖులలో కొందరు.
 
 
ఇవి కూడా చూడండి:
 • వందేమాతరం ఉద్యమం (1938),


హోం
విభాగాలు: తెలంగాణ విశ్వవిద్యాలయాలు, హైదరాబాదు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక