26, నవంబర్ 2020, గురువారం

నాంపల్లి మండలం (Nampally Mandal)

జిల్లాహైదరాబాదు
రెవెన్యూ డివిజన్హైదరాబాదు
అసెంబ్లీ నియోనాంపల్లి
లోకసభ నియోసికింద్రాబాదు
రెవెన్యూ గ్రామాలు
2
(ఇది హైదరాబాదు జిల్లా నాంపల్లి మండలానికి చెందిన వ్యాసము. నల్గొండ జిల్లా నాంపల్లి వ్యాసం కోసం ఇక్కడ చూడండి)
 
నాంపల్లి హైదరాబాదు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం హైదరాబాదు జిల్లాలో భౌగోళికంగా మధ్యలో ఉంది. పురాతనమైన కట్టడాలు, చారిత్రక ఆనవాళ్లకు ఈ మండలం ప్రసిద్ధి చెందింది. మండలంలో 2 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. మండలం దక్షిణ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది.
 
తెలంగాణ రాష్ట్రంలోనే తొలి కళాశాల అయిన నిజాం కళాశాల ఈ మండలంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనం, హైదరాబాదు స్టేషన్‌గా పిల్వబడే నాంపల్లి రైల్వేస్టేషన్, చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్, రాష్ట్రంలోనే అతి పెద్ద బస్ స్టేషన్ అయిన ఎంజీబీఎస్, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఉన్న గన్‌ఫౌండ్రి, పండ్ల విక్రయాలకౌ పేరుపొందిన జామ్‌బాగ్, రాష్ట్ర ఆడిటు సంచాలకుల మరియు భీమా కార్యాలయాలున్న ఇన్సూరెన్స్ భవనం, ఇంటర్మీడియత్ బోర్డ్ కార్యాలయం ఈ మండలంలో ఉన్నాయి.. 
 
 
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా నాంపల్లి మండలం హైదరాబాదు జిల్లాలో మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన ఖైరతాబాదు మండలం, ఈశాన్యాన హయత్‌నగర్ మండలం, తూర్పున అంబర్‌పేట్ మండలం, దక్షిణాన చార్మినార్ మండలం మరియు బహదూర్‌పుర మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది.

రవాణా సౌకర్యాలు:
నాంపల్లి నుంచి బేగంపేట వైపు రైలుమార్గం ఉంది. తెలంగాణలోనే తొలి సారిగా నాంపల్లి నుంచి వాడి వరకు రైలుమార్గం నిర్మించబడింది. జాతీయ రహదారి కూడా మండలం మీదుగా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
ఈ మండలము నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాదులో నాంపల్లి (జాంబాగ్) 77వ వార్డులో, గన్‌ఫౌండ్రి 78వ వార్డులో, బేగంబజార్ 5వ వార్డులో, మంగల్‌హాట్ 63వ వార్డులో, బర్కత్‌పూర 80వ వార్డులో, గోషామహల్ 51వ వార్డులో భాగంగా ఉంది. ఈ డివిజన్లు గోషామహల్ సర్కిల్‌లో, ఖైరతాబాదు జోన్‌లో భాగంగా ఉన్నాయి.
 
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
నాంపల్లి (Nampally),  తోతగూడ (Tothaguda),
 
మండల పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలు:
సుల్తాన్ బజార్, కాచిగూడ, గాంధీభవన్, నాంపల్లి, మహరాజ్‌గంజ్, అఫ్జల్ గంజ్, చాదర్‌ఘాట్, నిజాం కాలేజి, గోషామహల్, ఎల్బీ స్టేడియం, మేటర్నిటి హాస్పిటల్, మంగల్‌హాట్, బేగంబజార్, ఫ్లక్‌నూమ, గన్‌ఫౌండ్రి, జాంబాగ్, గౌలిగూడ, రాంకోటి, బ్యాంక్ స్ట్రీట్, తిలక్ రోడ్, అగాపుర, హష్మత్ గంజ్, కింగ్ కోటి, ముస్లింజంగ్ పూల్, చిరాగ్ అలీ రోడ్, మోజంజాహి మార్కెట్, చుడిబజార్, ట్రూప్ బజార్
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / ప్రాంతాలు:
.



ఇవి కూడా చూడండి:
 
ఫోటో గ్యాలరీ

(నాంపల్లి రైల్వేస్టేషన్)
(జూబ్లిహాల్)
c c



హోం,
విభాగాలు:
హైదరాబాదు జిల్లా మండలాలు, నాంపల్లి మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Hyderabad Dist, 2013,
  • Handbook of Census Statistics, Hyderabad District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • హైదరాబాదు జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://hyderabad.telangana.gov.in/te/ (Official Website of Hyderabad District)


Nampally Mandal in Telugu, Hyderabad Dist (district) Mandals in telugu, Hyderabad Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి