తెలంగాణలో భౌగోళికంగా చిన్న జిల్లా హైదరాబాదు. జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 రెవెన్యూ మండలాలు, 67 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ జిల్లా పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థలో భాగంగా ఉంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాదు నగరం జిల్లా మరియు రాష్ట్ర కేంద్రము. మూసీనది హైదరాబాదు మధ్యగా ప్రవహిస్తోంది. ఈ జిల్లా మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లా లచే ఆవరించబడి ఉంది. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 39,43,323, వైశాల్యం 217 చకిమీ. బిర్లామందిర్, చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కామసీదు, నెహ్రూ జూ పార్క్ హైదరాబాదులోని ప్రముఖ సందర్శనీయ స్థలాలు. చరిత్ర: 1591లో కుతుబ్ షాహీ సుల్తాన్ చే నిర్మించిబడిన హైదరాబాదు ఆ తర్వాత నిజాం షాహీలకు కూడా రాజధానిగా కొనసాగింది. 1948లో భారత యూనియన్‌లో విలీనమైన పిదప హైదరాబాదు రాష్ట్ర రాజధానిగా, 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా వ్యవహరిస్తోంది. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్రాత్మక వందేమాతరం ఉద్యమం జరిగింది. 1969 మరియు 2009-14 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. పర్యాటకం: కుతుబ్‌షాహీ మరియు నిజాంషాహీల కాలం నాటి పలు నిర్మాణాలు ప్రస్తుతం హైదరాబాదు నగరంలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సికింద్రాబాదు హైదరాబాదు యొక్క జంటనగరం. సాఫ్ట్ వేర్ రంగంలో పేరుపొందిన హైటెక్ సిటి ప్రాంతం కలుపుకొని హైదరాబాదును ట్రైసిటీస్‌గా పిలుస్తుంటారు. హైదరాబాదు నగర పాలన గ్రేటర్ హైదరాబాదుచే నిర్వహించబడుతున్నది. 1933లో ప్రారంభమైన నగరపాలక సంస్థ కొంతకాలానికి నగరపాలక హోదా కోల్పోయిననూ 1950లో మళ్ళీ నగరపాలక సంస్థగా అవతరించింది. 1960లో సికింద్రాబాదు నగరపాలక సంస్థ హైదరాబాదు కార్పోరేషన్‌లో విలీనమైంది. 2007లో పరిసర 12 పురపాలక సంఘాలు నగరపాలక సంస్థలో విలీనం కావడంతో గ్రేటర్‌గా అవతరించింది. విద్యాసంస్థలు: హైదరాబాదు జిల్లాలో 1565 ప్రాథమిక పాఠశాలలు, 568 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1344 ఉన్నత పాఠశాలలు, 9 కేంద్రీయ పాఠశాలలు, 317 జూనియర్ కళాశాలలు, 215 డిగ్రీ కళాశాలలు, 17 ఇంజనీరింగ్ కళాశాలలు, 9 ఫార్మసి కళాశాలలు, 18 బీఎడ్ కళాశాలలు, 10 న్యాయ కళాశాలలు ఉన్నాయి. రాష్ట్రంలోనే పురాతనైమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం జిల్లాలో ఉంది. రవాణా సౌకర్యాలు: హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాదులో ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల్వబడుతుంది. హైదరాబాదు నుంచి దేశంలోని ప్రధాన నగరాలను కల్పుతూ రైలు మరియు రోడ్డు మార్గాలున్నాయి. దేశంలోనే పొడవైన కన్యాకుమార్-శ్రీనగర్ జాతీయ రహదారి నెం.44, ముంబాయి-విజయవాడ జాతీయ రహదారి నెం.65, జాతీయ రహదారి నెం. 202 హైదరాబాదు గుండా వెళ్తున్నాయి. సికింద్రాబాదు ముఖ్యమైన రైల్వేజంక్షన్‌గా ఉంది. దక్షిణమధ్యరైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాదులో ఉంది. వాడి, కాజీపేట, ముద్ఖేడ్, డోన్ వైపు రైలుమార్గాలున్నాయి. నగరంలో MMTS మరియు మెట్రోరైలు ప్రజలకు సౌకర్యంగా ఉంది. రాజకీయాలు: జిల్లాలో 2 లోక్‌సభ నియోజకవర్గాలు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సికింద్రాబాదు నుంచి లోక్‌సభకు విజయం సాధించిన కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. ఇదివరకు సికింద్రాబాదు నుంచి విజయం సాధించిన పి.శివశంకర్ మరియు బండారు దత్తాత్రేయలు కూడా కేంద్రమంత్రులుగా పనిచేశారు. జిల్లా మొత్తం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. గ్రేటర్ హైదరాబాదులోని 15 డివిజన్లలో అత్యధికభాగంగా హైదరాబాదు జిల్లాకు చెందినవి. హైదరాబాదు జిల్లా మండలాలు
అమీర్‌పేట్, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, అంబర్‌పేట్, హిమాయత్‌నగర్, నాంపల్లి, షేక్‌పేట్, ఖైరతాబాదు, ఆసిఫ్‌నగర్, సైదాబాదు, బహదూర్ పురా, బండ్లగూడ, సికింద్రాబాదు, ముషీరాబాదు, గోల్కొండ, చార్మినార్. - ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Alwal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి