నాంపల్లి ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
నాంపల్లి ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

26, నవంబర్ 2020, గురువారం

నాంపల్లి మండలం (Nampally Mandal)

జిల్లాహైదరాబాదు
రెవెన్యూ డివిజన్హైదరాబాదు
అసెంబ్లీ నియోనాంపల్లి
లోకసభ నియోసికింద్రాబాదు
రెవెన్యూ గ్రామాలు
2
(ఇది హైదరాబాదు జిల్లా నాంపల్లి మండలానికి చెందిన వ్యాసము. నల్గొండ జిల్లా నాంపల్లి వ్యాసం కోసం ఇక్కడ చూడండి)
 
నాంపల్లి హైదరాబాదు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం హైదరాబాదు జిల్లాలో భౌగోళికంగా మధ్యలో ఉంది. పురాతనమైన కట్టడాలు, చారిత్రక ఆనవాళ్లకు ఈ మండలం ప్రసిద్ధి చెందింది. మండలంలో 2 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. మండలం దక్షిణ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది.
 
తెలంగాణ రాష్ట్రంలోనే తొలి కళాశాల అయిన నిజాం కళాశాల ఈ మండలంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనం, హైదరాబాదు స్టేషన్‌గా పిల్వబడే నాంపల్లి రైల్వేస్టేషన్, చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్, రాష్ట్రంలోనే అతి పెద్ద బస్ స్టేషన్ అయిన ఎంజీబీఎస్, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఉన్న గన్‌ఫౌండ్రి, పండ్ల విక్రయాలకౌ పేరుపొందిన జామ్‌బాగ్, రాష్ట్ర ఆడిటు సంచాలకుల మరియు భీమా కార్యాలయాలున్న ఇన్సూరెన్స్ భవనం, ఇంటర్మీడియత్ బోర్డ్ కార్యాలయం ఈ మండలంలో ఉన్నాయి.. 
 
 
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా నాంపల్లి మండలం హైదరాబాదు జిల్లాలో మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన ఖైరతాబాదు మండలం, ఈశాన్యాన హయత్‌నగర్ మండలం, తూర్పున అంబర్‌పేట్ మండలం, దక్షిణాన చార్మినార్ మండలం మరియు బహదూర్‌పుర మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది.

రవాణా సౌకర్యాలు:
నాంపల్లి నుంచి బేగంపేట వైపు రైలుమార్గం ఉంది. తెలంగాణలోనే తొలి సారిగా నాంపల్లి నుంచి వాడి వరకు రైలుమార్గం నిర్మించబడింది. జాతీయ రహదారి కూడా మండలం మీదుగా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
ఈ మండలము నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాదులో నాంపల్లి (జాంబాగ్) 77వ వార్డులో, గన్‌ఫౌండ్రి 78వ వార్డులో, బేగంబజార్ 5వ వార్డులో, మంగల్‌హాట్ 63వ వార్డులో, బర్కత్‌పూర 80వ వార్డులో, గోషామహల్ 51వ వార్డులో భాగంగా ఉంది. ఈ డివిజన్లు గోషామహల్ సర్కిల్‌లో, ఖైరతాబాదు జోన్‌లో భాగంగా ఉన్నాయి.
 
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
నాంపల్లి (Nampally),  తోతగూడ (Tothaguda),
 
మండల పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలు:
సుల్తాన్ బజార్, కాచిగూడ, గాంధీభవన్, నాంపల్లి, మహరాజ్‌గంజ్, అఫ్జల్ గంజ్, చాదర్‌ఘాట్, నిజాం కాలేజి, గోషామహల్, ఎల్బీ స్టేడియం, మేటర్నిటి హాస్పిటల్, మంగల్‌హాట్, బేగంబజార్, ఫ్లక్‌నూమ, గన్‌ఫౌండ్రి, జాంబాగ్, గౌలిగూడ, రాంకోటి, బ్యాంక్ స్ట్రీట్, తిలక్ రోడ్, అగాపుర, హష్మత్ గంజ్, కింగ్ కోటి, ముస్లింజంగ్ పూల్, చిరాగ్ అలీ రోడ్, మోజంజాహి మార్కెట్, చుడిబజార్, ట్రూప్ బజార్
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / ప్రాంతాలు:
.



ఇవి కూడా చూడండి:
 
ఫోటో గ్యాలరీ

(నాంపల్లి రైల్వేస్టేషన్)
(జూబ్లిహాల్)
c c



హోం,
విభాగాలు:
హైదరాబాదు జిల్లా మండలాలు, నాంపల్లి మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Hyderabad Dist, 2013,
  • Handbook of Census Statistics, Hyderabad District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • హైదరాబాదు జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://hyderabad.telangana.gov.in/te/ (Official Website of Hyderabad District)


Nampally Mandal in Telugu, Hyderabad Dist (district) Mandals in telugu, Hyderabad Dist Mandals in telugu,

16, మార్చి 2018, శుక్రవారం

నాంపల్లి మండలం (Nampalli Mandal)

నాంపల్లి మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ దేవరకొండ
అసెంబ్లీ నియోజకవర్గంమునుగోడు
లోకసభ నియోజకవర్గంభువనగిరి
(ఇది నల్గొండ జిల్లా నాంపల్లి మండలమునకు చెందిన వ్యాసము. హైదరాబాదు జిల్లా నాంపల్లి మండల వ్యాసం కోసం ఇక్కడ చూడండి)
 
నాంపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.. మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలు కలవు. 2016 జిల్లాల పునర్విభజన సమయంలో ఈ మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని చండూర్ మండలంలో కలిపారు.

సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున గుర్రంపోడు మండలం, దక్షిణాన కొండమల్లేపల్లి మండలం, పశ్చిమాన చింతపల్లి మండలం, ఉత్తరాన మర్రిగూడ మరియు చండూర్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 38801. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41161. ఇందులో పురుషులు 20695, మహిళలు 20466. అక్షరాస్యత శాతం 53.34%.
మండలంలోని గ్రామాలు:
B Gouraram, B Timmapur, Chittampahad, Damera, Devathpalli, Fakeerpuram, G Mallepally, Ganugupally, Hydlapuram, K Thirumalagiri, Kethepalli, Mahamadapuram, Mallapurajupally , Medlavai, Mustipalli, Nampally, Nerallapalli, Pagidipally, Pasnur, Peddapuram, Reballi, S Lingotam, Sharbhapuram, Sunkishala, T P Gouraram, Thirumalagiri, Thummalapalli, Vaddepally

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం,
విభాగాలు:
నల్గొండ జిల్లా మండలాలు,  నాంపల్లి మండలము, దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Nampalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

1, మే 2014, గురువారం

నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (Nampally Assembly Constituency)

నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాదు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి.ఇది సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. పునర్విభజనకు ముందు ఈ ప్రాంతం ఆసిఫ్‌నగర్ నియోజకవర్గం పరిధిలో ఉండేది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 63.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 విరాసత్ ఖాన్ ఎం.ఐ.ఎం. ఫిరోజ్ ఖాన్‌ ప్రజారాజ్యం పార్టీ
2014



2018 జాఫర్ హుస్సేన్ ఎం.ఐ.ఎం. ఫిరోజ్ ఖాన్‌ కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ఎం.ఐ.ఎం.పార్టీకి చెందిన విరాసత్ ఖాన్ తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌పై 6808 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్, భాజపా తరఫున దేవర కరుణాకర్, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్ పోటీచేశారు. మజ్లిస్ పార్టీకి చెందిన జాఫర్ హుస్సేన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్ పై 9675 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: హైదరాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

3, జూన్ 2018, ఆదివారం

గుర్రంపోడ్ మండలం (Gurrampode Mandal)

గుర్రంపోడు మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ దేవరకొండ
అసెంబ్లీ నియోజకవర్గంనాగార్జునసాగర్
లోకసభ నియోజకవర్గంనల్గొండ
గుర్రంపోడు నల్గొండ జిల్లాకు చెందిన మండలము.మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలకేంద్రం అక్షాంశరేఖాంశాలు 16.8667° ఉత్తర అక్షాంశం,79.1167° తూర్పు రేఖాశం. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మండలానికి సాగునీరు లభిస్తుంది.

సరిహద్దులు:
ఈ మండలం భౌగోళికంగా నల్గొండ జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన చండూర్, కనగల్ మండలాలు, తూర్పున హాలియా మండలం, ఆగ్నేయన పెద్దవూర మండలం, ద్క్షిణాన పెద్ద ఆదిశర్లపల్లి మండలం, నైరుతిన కొండమల్లేపల్లి మండలం, పశ్చిమాన నాంపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి.


మండలంలోని గ్రామాలు:
Amaloor, Bollaram patti Kopp, Chamled, Chepur, Chinthaguda, Gurrampodu, Junuthala, Kacharam patti Kop, Kalwapalli, Kondapur, Koppole, Kothalapur, Mailapur, Makkapalli, Mosangi, Mulkalapalli, Nadikuda, Pallipahad, Palwai, Parlapalli, Pochampalli, Shakajipur, Sulthanpuram, Thanedarpally, Thenepally, Utlapalli, Vattikodu.

ప్రముఖ గ్రామాలు
పాల్వాయి (Palwai):
ఈ గ్రామంలో పురాతన శిలాలయం ఉంది. ఫిబ్రవరి 2011లో గ్రామంలో కాకతీయుల కాలం నాటి శిలాశాసనం వెలుగుచూసింది.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c c
c c


హోం,
విభాగాలు:
నల్గొండ జిల్లా మండలాలు,  గుర్రంపోడ్ మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Gurrampode Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

8, మే 2015, శుక్రవారం

ఐరాల మండలం (Irala Mandal)

జిల్లాచిత్తూరు జిల్లా
జనాభా52730 (2011),
అసెంబ్లీ నియో.పూతలపట్టు అ/ని,
లోకసభ నియో.చిత్తూరు లో/ని,
పిన్‌కోడ్517130
ఎస్టీడి కోడ్08573
ఐరాల చిత్తూరు జిల్లాకు చెందిన మండలము. ప్రసిద్ధి చెందిన కాణిపాకం క్షేత్రం మండలంలో ఉంది. ఈ మండలము పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52730. ఐరాల, ముదిగోలం, నాంపల్లి మండలంలోని పెద్ద గ్రామాలు.

భౌగోళికం, సరిహద్దులు:
చిత్తూరు జిల్లాలో ఐరాల మండలం సుమారుగా మధ్యలో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన సోమల మండలం, ఉత్తరాన పాకాల మండలం, తూర్పున పూతలపట్టు మండలం, దక్షిణాన తవణంపల్లె మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. మండలకేంద్రం 13°24′16″ ఉత్తర అక్షాంశం, 78°57′31″ తూర్పు రేఖాంశంపై ఉంది.

చరిత్ర:
ఈ ప్రాంతం స్వాతంత్ర్యానికి ముందు మద్రాసు ప్రావిన్సులో ఉండగా 1947-53 కాలంలో మద్రాసు రాష్ట్రంలో కొనసాగి 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రంలో, 1956 నవంబరు 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 48891. ఇందులో పురుషులు 24640, మహిళలు 24251. గృహాల సంఖ్య 11632.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52730. ఇందులో పురుషులు 25312, మహిళలు 27418. స్త్రీపురుష నిష్పత్తి (1083/వెయ్యి పురుషులకు)లో ఈ మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది.

కాణిపాకం ఆలయం
రాజకీయాలు:
ఈ మండలము పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

మండల విశిష్టతలు:
  • ప్రసిద్ధి చెందిన కాణిపాకం క్షేత్రం మండలంలో ఉంది.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీపురుష నిష్పత్తిలో ఈ మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది.
మండలంలోని గ్రామాలు:
అయ్యల కృష్ణారెడ్డిపల్లె • ఎర్లంపల్లె • ఐరాల • కాణిపాకం • కామినాయనిపల్లె • కొత్తపల్లె • కొల్లపల్లె • గుండ్లపల్లె • గూబలవారిపల్లె • చిగరపల్లె • చుక్కావారిపల్లె • తిరుమలయ్యగారిపల్లె • దిగువనాగులవారిపల్లె • నాంపల్లె • పుత్రమద్ది • పుల్లూరు • పెద్దసామిరెడ్డిపల్లె • పేరయ్యగారి పల్లి • పొలకల • ముదిగొళం • మొరంపల్లె • వెంకట సముద్ర అగ్రహారం • సంగనపల్లె

విభాగాలు: చిత్తూరు జిల్లా మండలాలు, ఐరాల మండలం, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోకసభ నియోజకవర్గం,


 = = = = =


3, జూన్ 2018, ఆదివారం

కొండమల్లేపల్లి మండలం (Konda Mallepalli Mandal)

కొండమల్లేపల్లి మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ దేవరకొండ
అసెంబ్లీ నియోజకవర్గందేవరకొండ
లోకసభ నియోజకవర్గంనల్గొండ
కొండమల్లేపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. దేవరకొండ మండలంలోని 14 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఇది దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండల కేంద్రం మల్లేపల్లి రహదారుల ప్రముఖ కూడలిగా ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున పెద్ద ఆదిశర్లపల్లి మండలం, దక్షిణాన నేరెడిగొమ్ము మండలం, పశ్చిమాన దేవరకొండ మండలం, ఉత్తరాన నాంపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు:
మల్లేపల్లి రహదారుల ప్రముఖ కూడలిగా ఉంది. హైదరాబాదు, దేవరకొండ, నల్గొండ, మిర్యాలగూడ వెళ్ళు రహదారులు ఈ కూడలి వద్ద ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు:
Achampet-Patti-Perwal, Channamunenipally, Channaram, Chinna Adiserlapally, Chinthakuntla, Doniyal, Fakeerpur, Ghaji Nagar, Gummadavally, Kolmanthala Pahad, Konda Mallepally, Pendli Pakala, Vardhamaniguda, Yepur.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c c
c c


హోం,
విభాగాలు:
నల్గొండ జిల్లా మండలాలు,  కొండమల్లేపల్లి మండలము, దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Kondapallepalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

21, జూన్ 2013, శుక్రవారం

విభాగము: నల్గొండ జిల్లా మండలాలు (Portal: Nalgonda Dist Mandals)

విభాగము: నల్గొండ జిల్లా మండలాలు
(Portal: Nalgonda Dist Mandals)
  1. అడవి దేవులపల్లి మండలం (Adavidevulapalli Mandal),
  2. అనుముల / హాలియా మండలం (Anumula / Halia Mandal),
  3. చందంపేట మండలం (Chandam Pet Mandal),
  4. చండూర్ మండలం (Chandur Mandal),
  5. చింతపల్లి మండలం (Chintha Palli Mandal),
  6. చిట్యాల మండలం (Chityala Mandal),
  7. దామరచెర్ల మండలం (Dameracherla Mandal),
  8. దేవరకొండ మండలం (Devarakonda Mandal),
  9. గుండ్లపల్లి మండలం (Gundla Palli Mandal),
  10. గుర్రంపోడు మండలం (Gurrampode Mandal),
  11. కనగల్ మండలం (Kangal Mandal),
  12. కట్టంగూర్ మండలం (Kattangoor Mandal),
  13. కేతెపల్లి మండలం (Kethepalli Mandal),
  14. కొండమల్లేపల్లి మండలం (Konda Mallepally Mandal)
  15. మాడుగులపల్లి మండలం (Madugulapalli Mandal),
  16. మర్రిగూడ మండలం (Marri Guda Mandal),
  17. మిర్యాలగూడ మండలం (Miryalaguda Mandal),
  18. మునుగోడ్ మండలం (Munugode Mandal),
  19. నక్రేకల్ మండలం (Nakrekal Mandal),
  20. నల్గొండ మండలం (Nalgonda Mandal),
  21. నాంపల్లి మండలం (Nampalli Mandal),
  22. నార్కెట్‌పల్లి మండలం (Narketpalli Mandal),
  23. నేరెడిగొమ్ము మండలం (Neredugommu Mandal),
  24. నిడమనూర్ మండలం (Nidamanur Mandal),
  25. పెద్దఆదిశర్లపల్లి మండలం (Pedda Adiserlapalli Mandal),
  26. పెద్దవూర మండలం (Peddavura Mandal),
  27. శాలిగౌరారం మండలం (Saligouraram Mandal),
  28. తిప్పర్తి మండలం (Thipparthi Mandal),
  29. త్రిపురారం మండలం (Thripuraram Mandal),
  30. తిరుమలగిరి సాగర్ మండలం (Tirumalagiri Sagar Mandal),
  31. వేములపల్లి మండలం (Vemulapalli Mandal),

విభాగాలు: నల్గొండ జిల్లా, తెలంగాణ మండలాలు,

Tags: Nalgonda District Mandal information in Telugu, Nalgonda Jilla Mandalalu telugulu,

8, నవంబర్ 2020, ఆదివారం

విభాగము: హైదరాబాదు జిల్లా మండలాలు (Portal: Hyderabad District Mandals)

 
విభాగము: హైదరాబాదు జిల్లా మండలాలు
(Portal: Hyderabad Dist Mandals)
  1. అంబర్‌పేట్ మండలం (Amberpet Mandal),
  2. హిమాయత్ నగర్ మండలం (Himayathnagar Mandal),
  3. నాంపల్లి మండలం (Nampally Mandal),
  4. ఆసిఫ్‌నగర్ మండలం (Asifnagar Mandal),
  5. సైదాబాద్ మండలం (Saidabad Mandal),
  6. బహదూర్‌పుర మండలం (Bahadurpura Mandal),
  7. బండ్లగూడ మండలం (Bandlaguda Mandal),
  8. గోల్కొండ మండలం (Golkonda Mandal),
  9. చార్మినార్ మండలం (Charminar Mandal),
  10. అమీర్‌పేట్ మండలం (Ameerpet Mandal),
  11. తిరుమలగిరి మండలం (Tirumalagiri Mandal),
  12. మారెడ్‌పల్లి మండలం (Maredpally Mandal),
  13. షేక్‌పేట్ మండలం (Shaikpet Mandal),
  14. ఖైరతాబాద్ మండలం (Khairatabad Mandal),
  15. సికింద్రాబాదు మండలం (Secunderabad Mandal),
  16. ముషీరాబాద్ మండలం (Musheerabad Mandal),

హోం,
విభాగాలు: హైదరాబాదు జిల్లా, తెలంగాణ మండలాలు,

19, నవంబర్ 2020, గురువారం

హైదరాబాదు (Hyderabad)

స్థాపన
క్రీ.శ.1591
రాష్ట్రం
తెలంగాణ
జనాభా
68 లక్షలు (2011)
వైశాల్యం
625 చకిమీ
భారతదేశంలోనే ప్రముఖ నగరాలలో ఒకటైన హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉంది. భాగ్యనగర్ అని కూడా పిల్వబడే ఈ నగరం సాఫ్ట్‌వేర్ రంగంలో పేరుగాంచింది. సికింద్రాబాదు హైదరాబాదుకు జంటనగరం. క్రీ.శ.1591లో కులీ కుతుబ్ షాచే నిర్మించబడిన హైదరాబాదు దినదినాభివృద్ధి చెంది 2011 లెక్కల ప్రకారం 68 లక్షల జనాభాకు కల్గియుంది. కృష్ణానదికి ఉపనది అయిన మూసీనది నగరం గుండా ప్రవహిస్తోంది. బిర్లామందిర్, గోల్కొండ కోట, చార్మినార్, నెహ్రూ జూపార్క్, దుర్గంచెరువు, రామోజీ ఫిలింసిటి, సాలార్జంగ్ మ్యూజియం నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.
 
భౌగోళికం:
హైదరాబాదు నగరం ద్వీపకల్ప బారతదేశంలో దాదాపు మధ్యబాగంలో ఉంది. నగరం గుండా మూసీనది ప్రవహిస్తోంది. సముద్రమట్టం నుంచి సుమారు 541 మీ ఎత్తున ఉంది. నగర వైశాల్యం 625 చకిమీ. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ నగరంలోని ప్రధాన చెరువులు. హైదరాబాదు జిల్లా పూర్తిగా మరియు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో పాక్షికంగా వ్యాపించియుంది. 2011 లెక్కల ప్రకారం హైదరాబాదు జనాభా 68 లక్షలు.

చరిత్ర:
క్రీ.శ.1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాదు నిర్మాతగా పేరుపొందాడు. అదివరకు కుతుబ్‌షా పాలకులకు గోల్కొండ రాజధానిగా ఉండేది. రాజధానిని హైదరాబాదుకు మార్చిన పిదప చార్మినార్ నిర్మించబడింది. కుతుబ్‌షాహీలు, మొఘలులు, నిజాంషాహీలు హైదరాబాదు కేంద్రంగా పాలించారు. నిజాం కాలంలో 1908లో మూసీనది వరదల వల్ల అపార ప్రాణ, ఆస్తినష్తం జరిగింది. 1948 సెప్టెంబరు 17న విమోచనోద్యం వల్ల మరియు సర్దార్ పటేళ్ సాహసంతో చేపట్టిన ఆపరేషన్ పోలో వల్ల నిజాం పాలన అంతమై భారత యూనియన్‌లో విలీనమైంది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో కలిసే వరకు హైదరాబాదు రాష్ట్ర రాజధానిగా ఉండింది. 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగి జూన్ 2, 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజధానిగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఈ పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రముఖపాత్ర పోషించారు. పలు విద్యార్థులు ప్రాణత్యాగం చేసి అమరులైనారు.

నగర పాలన:
హైదరాబాదు నగర పాలన గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ (GHMC)చే సాగుతుంది. నగరపాలక సంస్థ 6 జోన్లుగా, 30 సర్కిళ్ళుగా, 150 వార్డులుగా విభజించబడి ఉంది. 2007లో పరిసర పురపాలక సంఘాలను విలీనంచేసి గ్రేటర్‌గా చేయబడింది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదుకు చెందిన విమానాశ్రయం శంషాబాదులో ఉంది. ఇది రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల్వబడుతుంది. సికింద్రాబాదు ప్రముఖ జంక్షన్ మరియు దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రధానకేంద్రము గానూ ఉంది. సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు రైళ్ళు ప్రయాణిస్తాయి. నగరంలో ఎంఎంటీఎస్ మరియు మెట్రో రైలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. జాతీయ రహదారి సంఖ్య 44, 65, 202 నగరం గుండా వెళ్ళుచున్నాయి. నగరంలో ప్రధాన బస్‌స్టేషన్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్. ఉత్తరాది జిల్లాకు వెళ్ళే బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వెళ్తుంటాయి.

విద్య:
1918లోనే హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. నిజాం కళాశాల తెలంగాణలోనే అతి పురాతనమైన కళాశాల. అఘోరనాథ చటోపాధ్యాయ ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం మరియు ఇతర పలు విశ్వవిద్యాలయాలు నగరంలో ఉన్నాయి.
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు-రాజధానులు, తెలంగాణ, హైదరాబాదు,


 = = = = =


16, జూన్ 2013, ఆదివారం

సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం (Secunderabad Loksabha Constituency)

సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
జిల్లాహైదరాబాదు జిల్లా
ప్రస్తుత ఎంపిజి.కిషన్ రెడ్డి
పార్టీభారతీయ జనతా పార్టీ


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో హైదరాబాదు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన జి.కిషన్ రెడ్డి  ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
2వ 1957-62 అహ్మద్ మొయినుద్దీన్ కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 అహ్మద్ మొయినుద్దీన్ కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 బకర్ అలీ మీర్జా కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 ఎం.ఎం.హషీమ్ తెలంగాణా ప్రజా సమితి
6వ 1977-80 ఎం.ఎం.హషీమ్ కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 పి.శివశంకర్ కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 టంగుటూరి అంజయ్య కాంగ్రెస్ పార్టీ
9వ 1989-91 టంగుటూరి మణెమ్మ కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ
11వ 1996-98 పి.వి.రాజేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ
13వ 1999-04 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ
14వ 2004-09 ఎం.అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 ఎం.అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ
17వ 2019- జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన ఎం.అంజన్ కుమార్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన బండారు దత్తాత్రేయపై 170167 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. అంజన్ కుమార్ 340549 ఓట్లు పొందగా, బండారు దత్తాత్రేయ 170382 ఓట్లు సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీనివాస సుధీర్ 3వ స్థానంలో, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి డి.శ్రావణ్ కుమార్ 4వ స్థానంలో, లోకసత్తా అభ్యర్థి నరసింహారావు 5వ స్థానంలో, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మహమ్మద్ అలీ 6వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 38 అభ్యర్థులు నామినేషన్ వేయగా 4 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. నలుగురు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 30 అభ్యర్థులు మిగిలారు.భాజపాకు చెందిన బండారు దత్తాత్రేయ విజయం సాధించి 4వ సారి లోకసభలో ప్రవేశించారు.

2019 ఎన్నికలు:
2019లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థి జి.కిషన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన తలసాని సాయికిరణ్‌పై 62114 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. భాజపా అభ్యర్థికి 3,84,780 ఓట్లు, తెరాస అభ్యర్థికి 3,22,666 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అంజన్ కుమార్ యాదవ్ 1,73,229 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడి నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి కేంద్రంలో నరేంద్రమోడి మంత్రివర్గంలో స్థానం పొందారు.


హోం,
విభాగాలు: హైదరాబాదు జిల్లా నియోజకవర్గాలు, సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు,


= = = = =

10, ఫిబ్రవరి 2018, శనివారం

చింతపల్లి మండలం (Chintapalli Mandal)

 చింతపల్లి మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ దేవరకొండ
అసెంబ్లీ నియోజకవర్గందేవరకొండ
లోకసభ నియోజకవర్గంనల్గొండ
చింతపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు కలవు.

సరిహద్దులు:
ఈ మండలం నల్గొండ జిల్లాలో పశ్చిమ వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి తూర్పున నాంపల్లి మండలం, ఉత్తరాన మర్రిగూడ మండలం, దక్షిణాన దేవరకొండ మండలం, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44053, 2011 నాటికి జనాభా 898 పెరిగి 44951 కు చేరింది. ఇందులో పురుషులు 22723, మహిళలు 22228.
మండలంలోని గ్రామాలు:
Anajipur, Chakalisheripally, Chinthapally, Gadiyagouraram, Godakandla , Homanthalapally, Kokkirala Gouraram, Kurmapally, Kurmedu, Madhanapuru, Mallareddypally, Nasarlapally, Nelvalapally, P.K Mallepally, Polepally Ramnagar, Takkalapally, Teeded, Thirumalapuram, Ummapuram, Upparapally, Varkala, Vinjamoor,

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ

2016కు ముందు నల్గొండ జిల్లాలో
చింతపల్లి మండల స్థానం
c
c c


విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు,  చింతపల్లి మండలము, దేవరకొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Chintapalli Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

చండూర్ మండలం (Chandur Mandal)

 చండూర్ మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ నల్గొండ
అసెంబ్లీ నియోజకవర్గంమునుగోడు
లోకసభ నియోజకవర్గంభువనగిరి
చండూర్ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఇది నల్గొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది.

సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మునుగోడు మండలం, తుర్పున నల్గొండ మండలం, ఈశాన్యాన నార్కెట్‌పల్లి మండలం, దక్షిణాన నాంపల్లి మండలం, పశ్చిమాన మర్రిగూడ మండలం, ఆగ్నేయాన గుర్రంపోడు మండలం, వాయువ్యాన యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 47189, 2011 నాటికి జనాభా 1603 పెరిగి 48792 కు చేరింది. ఇందులో పురుషులు 24790, మహిళలు 24002. పట్టణ జనాభా 10842, గ్రామీణ జనాభా 37950.
మండలంలోని గ్రామాలు:
Angadipeta, Bangarigadda, Bodangparthy, Chamalapally, Chandur, Donipamula, Gattuppal, Gundrepally, Idikuda, Kastala, Kondapuram, Kummandaniguda, Nermata, Pullemla, Shirdepally, Theretpally, Thummalapally, Udtalapally

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ

2016కు ఉందు నల్గొండ జిల్లాలో
చండూర్ మండల స్థానం
c
c c


విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు,  చండూర్ మండలము, నల్గొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Chandur Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

25, ఏప్రిల్ 2015, శనివారం

దోమకొండ సంస్థానము (Domakonda Samsthan)

దోమకొండ సంస్థానము
స్థాపనక్రీ.శ.15వ శతాబ్ది
వంశంకామినేని
చివరి పాలకుడురెండవ రాజా సోమేశ్వరరావు
తెలంగాణలోని ప్రాచీన సంస్థానాలలో ఒకటైన దోమకొండ సంస్థానం క్రీ.శ.15వ శతాబ్దిలో ప్రారంభమై హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో విలీనమయ్యే వరకు కొనసాగింది. ఈ సంస్థానానికి మూలం బిక్కవోలు సంస్థానం. ఇది ఇప్పటి మెదక్ జిల్లాలో ప్రారంభమై ఆ తర్వాత రాజధానిని కామరెడ్డికి మార్చారు. చివరికి దోమకొండకు మారి సంస్థానం రద్దయ్యే వరకు అదే రాజధానిగా పనిచేసింది. దోమకొండ సంస్థానాధిపతులు కామినేని వంశస్తులు.

దోమకొండ సంస్థానాధీశులు మొదట బహుమనీ సుల్తానులకు దుర్గాధిపతులుగా ఉండి తర్వాత స్వతంత్ర సంస్థానంగా ప్రకటించుకున్నారు. కుతుబ్ షాహీలు, ఆసఫ్‌జాలకు సామంతులుగా పరిపాలన సాగించారు.

సంస్థాన మూలపురుషుడు కామినేని చౌదరి కుమారుడు కాచారెడ్డి. క్రీ.శ.15వ శతాబ్దిలో ఇతను మొదట ప్రస్తుత కర్ణాటక ప్రాంత దుర్గాధిపతిగా ఉండి, తర్వాత బహుమనీ సుల్తాను కోరిక మేరకు బిక్కనవోలు సంస్థాన పాలకునిగా చేరాడు. ఈతడే బిక్కనవోలు సంస్థానాన్ని అభివృద్ధి పరిచాడు. ఈతని తర్వాత భోగిరెడ్డి, రెండవ కాచారెడ్డి, మొదటి ఎల్లారెడ్డి, మూడవ కాచరెడ్డి, రెండవ కామిరెడ్డి, చిన కామిరెడ్డి, పోతారెడ్డి, జోగారెడ్డి, పోతారెడ్డి -2 అనువారు వరుసగా బిక్కనవోనులు పాలించారు. రాజన్న చౌదరి కాలంలో సంస్థాన కేంద్రం బిక్కనవోలు నుండి రామిరెడ్డికి మారింది.

రాజేశ్వరరావు తర్వాత పెద్ద రాజేశ్వరరావు సంస్థాన పాలకుడయ్యాడు. ఇతను గోల్కొండ పాలకుడైన నిజాం అలీఖాన్‌కు విశ్వాసపాత్రుడు. నవాబును ఎదిరించిన చెన్నూరు, పాల్వంచ మొదలగు సంస్థానాధీశులను ఓడించి నవాబుచే చంద్రహాస, అంగుళీయాదికముల బహుమానం పొందారు. దోమకొండ సంస్థానంలో ఘనకీర్తిని సంపాదించిన వాడు సోమేశ్వరరావు. నైజాం ప్రభువు సోమేశ్వరరావును 'మహా బలవంత' అనే బిరుదుతో సత్కరించాడు. దోమకొండ సంస్థానాధీశులలో గొప్పదాత. తులాభారం తూగి ఆ ధనమంతా పేదలకు పంచి పెట్టినవాడు ఉమాపతిరావు.

దోమకొండ కోటలోని ఆలయం
దోమకొండ సంస్థాన పాలకులలో చివరివాడు రెండవ రాజా సోమేశ్వరరావు. ఈ సంస్థాన పాలన భారతదేశంలో జాగీర్లు రద్దు చేసేవరకు కొనసాగింది. దాదాపు 400 ఏళ్ళ పైబడి పరిపాలన చేసిన దోమకొండ సంస్థానాదీశులు అనేక ధర్మకార్యాలు చేయటమే కాక వ్యవసాయ అభివృద్ధి కోసం కొత్త చెరువులు నిర్మించారు. అనేక కొత్త గ్రామాలు నిర్మించారు. తెలుగు సాహిత్య సేవ చేశారు.

దోమకొండ సంస్థానాధీశుల పాలనకు మెచ్చి నైజాం రాజు హైదరాబాదులోని నాంపల్లి దగ్గర ఉమాబాగ్ అనే 30 ఎకరాలు ఇనాంగా ఇచ్చాడు. సోమేశ్వరరావు పాలన సాగుతున్నప్పుడు తెలంగాణ భారత సమాఖ్యలో కలిసిపోవడంతో సంస్థానం రద్దయింది. దాంతో కామినేని వంశస్థులు హైదరాబాదులో స్థిరపడ్డారు. 1954 నుంచి ఆరేళ్లపాటు దోమకొండ కోటలో జనతా కాలేజీ నడిచింది. తర్వాత దాన్ని పాలెంకు తరలించారు.


హోం,
విభాగాలు: తెలంగాణ సంస్థానాలు, నిజామాబాదు జిల్లా చరిత్ర, దోమకొండ సంస్థానము,


 = = = = =


3, ఏప్రిల్ 2014, గురువారం

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం (Munugode Assembly Constituency)

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 6 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • మునుగోడు,
  • నారాయణపూర్.
  • మర్రిగూడ,
  • చండూరు,
  • నాంపల్లి,
  • చౌటుప్పల్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 పల్లా వెంకటరెడ్డి సి.పి.ఐ. చిలువెరు కాశీనాథ్‌ తెలుగుదేశం పార్టీ
2009 యాదగిరిరావు సి.పి.ఐ. పి.గోవర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 ప్రభాకర్ రెడ్డి తెరాస పాల్వాయి స్రవంతి ఇండిపెండెంట్
2018 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ రెడ్డి తెరాస

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సి.పి.ఐ పార్టీకి చెందిన పల్లా వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిలువెరు కాశీనాథ్‌పై 11285 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వెంకటరెడ్డి 55252 ఓట్లు పొందగా, కాశీనాథ్ 43967 ఓట్లు సాధించారు.

2009 ఎన్నికలు:
 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థి యాదగిరిరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.గోవర్థన్ రెడ్డిపై 3595 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారిగా శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన పాల్వాయి స్రవంతిపై 37884 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికలలో తెరాస తరఫున కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భాజపా తరఫున జి.మనోహర్ రెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై 22552 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, భువనగిరి లోకసభ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం,   

= = = = = 

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మర్రిగూడ మండలం (Marriguda Mandal)

మర్రిగూడ మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ దేవరకొండ
అసెంబ్లీ నియోజకవర్గంమునుగోడు
లోకసభ నియోజకవర్గంభువనగిరి
మర్రిగూడ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఇది దేవరకొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది. మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, 15 గ్రామపంచాయతీలు కలవు. విమోచనోద్య పోరాటయోధులు పొనుగోటి మాధవరావు, పండ్రప్రగడ శ్రీధరరావు, మార్నేని మేల్కి ఈ మండలానికి చెందినవారు.

సరిహద్దులు:
ఈ మండలానికి ఈశాన్యాన మరియు తుర్పున చండూరు మండలం, దక్షిణాన నాంపల్లి మరియు చింతపల్లి మండలాలు, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, ఉత్తరాన యాదాద్రి భువనగిరి జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 36946, 2011 నాటికి జనాభా 393 తగ్గి 36553 కు చేరింది. ఇందులో పురుషులు 18608, మహిళలు 17945.
మండలంలోని గ్రామాలు:
Anthampet, Bhatlapally, Damera Bheemanapally, Indurthy, Khudabakshpally, Kondur, Lenkalapally, Marriguda, Metichandapur, Namapur, Sarampet, Somarajguda, Tammadapally, Tirugandlapally, Vattipally, Venkepally , Yerugandlapally

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
2016కు ముందు నల్గొండ జిల్లాలో
మర్రిగూడ స్థానం
మర్రిగూడ స్థానం
(గూగుల్ మ్యాప్)

c c


విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు,  మర్రిగూడ మండలము, దేవరకొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Marriguda Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

8, నవంబర్ 2020, ఆదివారం

హైదరాబాదు జిల్లా (Hyderabad District)

వైశాల్యం
217 చకిమీ
జనాభా
39,43,323
మండలాలు
16
రెవెన్యూ డివిజన్లు
2
లోక్‌సభ స్థానాలు
2
అసెంబ్లీ స్థానాలు
15
తెలంగాణలో భౌగోళికంగా చిన్న జిల్లా హైదరాబాదు. జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 రెవెన్యూ మండలాలు, 67 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ జిల్లా పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థలో భాగంగా ఉంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాదు నగరం జిల్లా మరియు రాష్ట్ర కేంద్రము. మూసీనది హైదరాబాదు మధ్యగా ప్రవహిస్తోంది. ఈ జిల్లా మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లా లచే ఆవరించబడి ఉంది. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 39,43,323,  వైశాల్యం 217 చకిమీ.  బిర్లామందిర్, చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కామసీదు, నెహ్రూ జూ పార్క్ హైదరాబాదులోని ప్రముఖ సందర్శనీయ స్థలాలు.

చరిత్ర:
1591లో కుతుబ్ షాహీ సుల్తాన్ చే నిర్మించిబడిన హైదరాబాదు ఆ తర్వాత నిజాం షాహీలకు కూడా రాజధానిగా కొనసాగింది. 1948లో భారత యూనియన్‌లో విలీనమైన పిదప హైదరాబాదు రాష్ట్ర రాజధానిగా, 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా వ్యవహరిస్తోంది. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్రాత్మక వందేమాతరం ఉద్యమం జరిగింది. 1969 మరియు 2009-14 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది.

పర్యాటకం:
కుతుబ్‌షాహీ మరియు నిజాంషాహీల కాలం నాటి పలు నిర్మాణాలు ప్రస్తుతం హైదరాబాదు నగరంలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సికింద్రాబాదు హైదరాబాదు యొక్క జంటనగరం. సాఫ్ట్ వేర్ రంగంలో పేరుపొందిన హైటెక్ సిటి ప్రాంతం కలుపుకొని హైదరాబాదును ట్రైసిటీస్‌గా పిలుస్తుంటారు.
హైదరాబాదు నగర పాలన గ్రేటర్ హైదరాబాదుచే నిర్వహించబడుతున్నది. 1933లో ప్రారంభమైన నగరపాలక సంస్థ కొంతకాలానికి నగరపాలక హోదా కోల్పోయిననూ 1950లో మళ్ళీ నగరపాలక సంస్థగా అవతరించింది. 1960లో సికింద్రాబాదు నగరపాలక సంస్థ హైదరాబాదు కార్పోరేషన్‌లో విలీనమైంది. 2007లో పరిసర 12 పురపాలక సంఘాలు నగరపాలక సంస్థలో విలీనం కావడంతో గ్రేటర్‌గా అవతరించింది.

విద్యాసంస్థలు:
హైదరాబాదు జిల్లాలో 1565 ప్రాథమిక పాఠశాలలు, 568 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1344 ఉన్నత పాఠశాలలు, 9 కేంద్రీయ పాఠశాలలు, 317 జూనియర్ కళాశాలలు, 215 డిగ్రీ కళాశాలలు, 17 ఇంజనీరింగ్ కళాశాలలు, 9 ఫార్మసి కళాశాలలు, 18 బీఎడ్ కళాశాలలు, 10 న్యాయ కళాశాలలు ఉన్నాయి. రాష్ట్రంలోనే పురాతనైమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం జిల్లాలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాదులో ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల్వబడుతుంది. హైదరాబాదు నుంచి దేశంలోని ప్రధాన నగరాలను కల్పుతూ రైలు మరియు రోడ్డు మార్గాలున్నాయి. దేశంలోనే పొడవైన కన్యాకుమార్-శ్రీనగర్ జాతీయ రహదారి నెం.44, ముంబాయి-విజయవాడ జాతీయ రహదారి నెం.65, జాతీయ రహదారి నెం. 202 హైదరాబాదు గుండా వెళ్తున్నాయి. సికింద్రాబాదు ముఖ్యమైన రైల్వేజంక్షన్‌గా ఉంది. దక్షిణమధ్యరైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాదులో ఉంది. వాడి, కాజీపేట, ముద్ఖేడ్, డోన్ వైపు రైలుమార్గాలున్నాయి. నగరంలో MMTS మరియు మెట్రోరైలు ప్రజలకు సౌకర్యంగా ఉంది.

రాజకీయాలు:
జిల్లాలో 2 లోక్‌సభ నియోజకవర్గాలు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సికింద్రాబాదు నుంచి లోక్‌సభకు విజయం సాధించిన కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. ఇదివరకు సికింద్రాబాదు నుంచి విజయం సాధించిన పి.శివశంకర్ మరియు బండారు దత్తాత్రేయలు కూడా కేంద్రమంత్రులుగా పనిచేశారు. జిల్లా మొత్తం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. గ్రేటర్ హైదరాబాదులోని 15 డివిజన్లలో అత్యధికభాగంగా హైదరాబాదు జిల్లాకు చెందినవి.
 
హైదరాబాదు జిల్లా మండలాలు
అమీర్‌పేట్, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, అంబర్‌పేట్, హిమాయత్‌నగర్, నాంపల్లి, షేక్‌పేట్, ఖైరతాబాదు, ఆసిఫ్‌నగర్, సైదాబాదు, బహదూర్ పురా, బండ్లగూడ, సికింద్రాబాదు, ముషీరాబాదు, గోల్కొండ, చార్మినార్.
-
.



ఇవి కూడా చూడండి:
 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
తెలంగాణ జిల్లాల వ్యాసాలు, హైదరాబాదు జిల్లా
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Hyderabad Dist, 2013,
  • Handbook of Census Statistics, Hyderabad District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • హైదరాబాదు జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://hyderabad.telangana.gov.in/ (Official Website of Hyderabad Dist),
  • తెలంగాణ మాసపత్రిక సంచికలు,


Alwal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక