22, నవంబర్ 2020, ఆదివారం

గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ (Greater Hyderabad Muncipal Corporation)

అవతరణ
1869 / 1950 / (గ్రేటర్‌గా 2007)
నగరం
హైదరాబాదు
జిల్లాలు
హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి,
డివిజన్లు
150
మేయర్
బొంతు రామ్మోహన్ (TRS)
దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థలలో ఒకటైన హైదరాబాదు మహా నగరపాలక సంస్థ (గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్, GHMC) పురాతనమైన చరిత్రను కల్గియుంది. 1869లోనే మున్సిపల్ బోర్డుగా అవతరించి, పలుసార్లు హోదాలు మరియు పరిధి మార్చబడి 1950లో మరోసారి కార్పోరేషన్‌గా మారింది. 2007లో పరిసర పురపాలక సంఘాలు, పంచాయతీల విలీనంతో గ్రేటర్ హోదా పొందింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 150 డివిజన్లు ఉన్నాయి. గ్రేటర్ వైశాల్యం 650 చదరపు కిలోమీటర్లు. హైదరాబాదు మహానగర పాలన వ్యవహారాలు చూసే గ్రేటర్‌కు ఐఏఎస్ హోదా కల్గిన కమీషనర్ గ్రేటర్ కార్యనిర్వాహక అధిపతిగా ఉన్నారు.

భౌగోళికం మరియు పరిధి:
ప్రారంభంలో చిన్న విస్తీర్ణంతో మొదలైన హైదరాబాదు నగరపాలక సంస్థ ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 4 జిల్లాలలో విస్తరించియుంది. హైదరాబాదు జిల్లా పూర్తిగా, మేడ్చర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లాలలో పాక్షికంగా విస్తరించియుంది. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 24 శాసనసభ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలున్నాయి. 2011 లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ జనాభా 70 లక్షలు.

చరిత్ర:
1869లో హైదరాబాదు మరియు ఛాదర్‌ఘాట్‌ లు మున్సిపల్ బోర్డులుగా ఏర్పడ్డాయి. 1886లో హైదరాబాదు పురపాలిక నుంచి విడిపోయి చాదర్‌ఘాట్ ప్రత్యేక మున్సీపాలిటీగా మారింది. 1933లో చాదర్‌ఘాట్‌ను మళ్ళీ హైదరాబాదులో కలిపి కార్పోరేషన్ హోదాకు పెంచారు.  1942లో హైదరాబాదు కార్పోరేషన్ నుంచి మున్సీపాలిటీకి దిగజారింది. 1950లోనే జూబ్లీహిల్స్ పురపాలక సంఘాన్ని హైదరాబాదులో కలిపి కార్పోరేషన్ హోదా చేశారు. ఆంధ్రపితామహుడిగా పేరుపొందిన మాడపాటి హన్మంతరావు 1951-54 కాలంలో హైదరాబాదు తొలి మేయరుగా పనిచేశారు. 1955లో సికింద్రాబాదును హైదరాబాదు కార్పోరేషన్‌లో విలీనం చేయబడింది. ఏప్రిల్ 16, 2007న పరిసర 12 పురపాలక సంఘాలు, 8 గ్రామపంచాయతీల విలీనంతో గ్రేటర్‌గా మార్చారు.
GHMC
గ్రేటర్ కార్యాలయం


రాజకీయాలు:
గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 5 లోక్‌సభ స్థానాలు (పాక్షికతో సహా), 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ నుంచి ఒక్కో కార్పోరేటర్ ఎన్నికై డివిజన్ పాలనలో బాధ్యత వహిస్తారు. 150 డివిజన్ల నుంచి ఎన్నికైన కార్పోరేటర్లు మరియు గ్రేటర్ పరిధిలోని ఎక్స్ అఫీషియో సభ్యులు, పార్లమెంటు సభ్యులు కలిసి మేయర్‌ను ఎన్నుకుంటారు. గ్రేటర్‌గా అవతరించిన పిదప 2009లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ 52, తెదేపా 45, ఎంఐఎం 43, భాజపా 4, ఇతరులు 5 స్థానాలలో విజయం సాధించాయి. 2009-12కాలంలో బండా కార్తీకరెడ్డి, 2012-16 కాలంలో మాజిద్ హుస్సేన్ మేయరుగా పనిచేశారు. 2016లో జరిగిన ఎన్నికలలో తెరాస 99, ఎంఐఎం 44, భాజపా 4, కాంగ్రెస్ 2, తెలుగుదేశం 1 స్థానాలలో విజయం సాధించాయి. చర్లపల్లి డివిజన్ నుంచి కార్పోరేటర్‌గా ఎన్నికైన తెరాసకు చెందిన బొంతు రామ్మోహన్ 2016 నుంచి మేయరుగా ఉన్నారు. డిసెంబరు 1, 2020న మరోసారి గ్రేటర్‌కు ఎన్నికలు జరిగాయి.

 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు:  హైదరాబాదు, తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక