థాయిలాండ్ ఆసియా ఖండానికి చెందిన దేశము. ఆగ్నేయాసియా ప్రాంతంలో ఉన్న ఈ దేశం పుర్వం సయామ్ గా పిల్వబడింది. 5.13 లక్షల చకిమీ వైశాల్యం మరియు 6.6 కోట్ల జనాభాను కల్గియుంది. దేశ జనాభాలో బౌద్ధులు సుమారు 94% కల్గియున్నారు. థాయిలాండ్ రాజధాని మరియు పెద్ద నగరం బాంకాక్, కరెన్సీ భాట్, అధికార భాష థాయ్, ప్రముఖ ప్రాజెక్టు యాన్‌హీ ప్రాజెక్టు. భౌగోళికం: థాయిలాండ్ మయన్మార్, లావోస్, కంబోడియా దేశాలను మరియు అండమాన్ సముద్రం, థాయిలాండ్ అగాధాన్ని సరిహద్దుగా కల్గియుంది. 5,13,120 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రపంచంలో 50వ పెద్ద దేశంగా మరియు 6.65 కోట్ల జనాభాతో 22వ అత్యధిక జనాభా కల్గినదేశంగా ఉంది. థాయిలాండ్‌లో ప్రవహించే ప్రధాన నది మెకాంగ్ నది. థాయిలాండ్ ఈశాన్య ప్రాంతంలో ఖోరట్ పీఠభూమి ఉంది. చరిత్ర: సుమారు 20వేల సంవత్సరాల నుంచి మానవజాతి నివశిస్తున్నట్లుగా ఆధారాలు లభించాయి క్రీ.పూ.2000లోనే వరి పండించినట్లు, క్రీ.పూ 500లో ఇనుము వాడినట్లు తెలుస్తుంది. 6వ శతాబ్దిలో హరిపుంచియా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ తర్వాత ఖ్మేర్ సామ్రాజ్యం, పాగన్ సామ్రాజ్యంలో కొనసాగింది. క్రీ.శ.11వ శతాబ్దికి చెందిన హిందు ఆలయం కూడా ఉంది. క్రీ.శ.13వ శతాభ్దిలో సుఖోతాయ్ సామ్రాజ్యం స్థాపించబడింది. ఇది థాయ్ ప్రజల తొలి సంస్థానంగా పరిగణించబడుతుంది. క్రీ.శ.16వ శతాబ్దిలో యూరోపియన్లు వ్యాపారం కోసం వచ్చి కొంతమంది స్థానిక రాజులను ఓడించి అధికారం పొందారు కాని దేశం వలస పాలనకు గురికాలేదు. 18వ శతాబ్దిలో రత్తనకోసిన్ సామ్రాజ్యం స్థాపించబడింది. థాయ్ చరిత్రలో పేరుపొందిన ప్రముఖ పాలకుడు రామా-1 ఈ రాజవంశానికి చెందినవాడు. 1932లో రక్తరహిత విప్లవం జరిగింది. దీనితో నిరంతరంగా సాగిన రాజవంశం అంతం కావడమే కాకుండా జూన్ 24న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. జూన్ 24ను స్వాతంత్ర్య దినోత్సవంగా జర్పుకుంటారు. ఆ తర్వాత కూడా రాజరికం కొనసాగుతున్ననూ అధికారం మాత్రం పరిమితం చేయబడింది. 1939లో సయామ్ పేరు థాయిలాండ్‌గా మార్పు చేయబడింది.
ఆర్థికం: థాయిలాండ్‌లో వస్త్రపరిశ్రమ అభివృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతోంది. పర్యాటక రంగం నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది. దేశ స్థూల ఆదాయంలో పర్యాటకం వాటా సుమారు 20% ఉంది. తీరప్రాంతాలలో విశాలమైన బీచ్‌లు ఉండుట మరియు మసాజ్ కు పేరుపొందుట వల్ల పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఆగ్నేయాసియాలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించే దేశంగా నిలిచింది. క్రీడలు: థాయ్ బాక్సింగ్ ఇక్కడి జనాదరణ కల్గిన క్రీడ. ఇటీవలి కాలంలో ఫుట్‌బాల్ మరియు వాలిబాల్ క్రీడలకు ఆదరణ పెరుగుతోంది. థాయిలాండ్ 4 సార్లు ఆసియా క్రీడలను నిర్వహించింది. ఈ క్రీడలను అత్యధిక పర్యాయాలు నిర్వహించిన దేశం ఇదే. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి