నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన నోముల నర్సింహయ్య జనవరి 9, 1956న నల్గొండ జిల్లా నక్రేకల్ మండలం పాలెంలో జన్మించారు. విద్యార్థిదశలోనే SFI నాయకుడిగా వ్యవహరించి తర్వాత కమ్యూనిస్ట్ మార్కిస్ట్ పార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి 2 సార్లు మండల అద్యక్షులుగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. డిసెంబరు 1, 2020న హైదరాబాదులో మరణించారు
రాజకీయ ప్రస్థానం: ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు నర్రా రాఘవరెడ్డి అనుచరుడిగా నక్రేకల్ నియోజకవర్గంలో స్థానం ఏర్పర్చుకున్న నోముల నర్సింహయ్య నక్రేకల్ మండల అధ్యక్షులుగా 2 సార్లు ఎన్నికైనారు. నరా రాఘవరెడ్డి తర్వాత 1999, 2004లలో నక్రేకల్ నుంచి సీపిఎం తరఫున 2 సార్లు శాసనసభకు ఎన్నికైనారు. 1999-2004 కాలంలో శాసనసభలీ సీపిఎం ఫ్లోర్ లీడర్‌గా కూడా వ్యవహరించారు. 2009లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో సీపీఎం ను వదిలి తెరాసలో చేరిన నోముల నర్సింహయ్య నాగార్జునసాగర్ నుంచి పోటీచేసి కె.జానరెడ్డి చెతిలో ఓడిపోయారు. 2018లో తెరాస తరఫున మళీ నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి జానరెడ్డిపై విజయం సాధించారు. శాసనసభ్యుడిగా ఉంటూనే డిసెంబరు 1, 2020న మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి