గాయనిగా, యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటిగా పేరుపొందిన సునీత ఉపద్రష్ట మే 10, 1978న విజయవాడలో జన్మించింది. (పెరిగింది గుంటూరులో). చిన్న వయస్సులోనే గాయనిగా పేరుతెచ్చుకున్న సునీత 1995లో గులాబి సినిమా ద్వారా గాయనిగా ప్రస్థానం ఆరంభించి వందలాది సినీ పాటలు పాడడమే కాకుండా 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. 2 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, 8 సార్లు నంది అవార్డులే కాకుండా పలు ఇతర పురస్కారాలు పొందింది. 19 సం.ల వయస్సులో కిరణ్ కుమార్ గోపరాజుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తర్వాత వీరు విడాకులు పొందారు. పారిశ్రామికవేత్త రామ్ వీరపనేనినితో మళ్ళీ వివాహం చేసుకుంటోంది.
సినీ ప్రస్థానం, గుర్తింపులు: 1995లో సునీత పాడిన తొలి పాట "ఏ వేళలో నీవు ...", ఈ పాట గులాబి సినిమాలోనిది, పాట రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి. చిన్న వయస్సులోనే సునీత లైట్ మ్యూజిక్ కేటగేరిలో ఆలిండియా రేడియో నుంచి జాతీయ పురస్కారం పొందింది. తన సినీ జీవితంలో ఉత్తమ గాయనిగా 2 సార్లు ఫిలింఫేర్ అవార్డులు (తెలుగు, కన్నడ), 9 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు స్వీకరించింది. 2011లో ఉత్తమ గాయనిగా లతామంగేష్కర్ అవార్డు పొందింది. టెలివిజన్ షో: సునీత గాయనిగానే కాకుండా టీవి యాంకర్‌గా, వ్యాఖ్యతగా కూడా రాణిస్తోంది. 1995 నుంచి ఇప్పటివరకు పలు టెలివిజన్ ఛానెళ్ళలో (దూరదర్శన్, జెమిని టీవి, ఈటీవి, మా టీవి, ఎస్వీబీసి తదితరాలలో) పనిచేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఈటీవిలో స్వరాభిషేకం ప్రోగ్రాంలో గాయనిగా మరియు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. భక్తిగీతాలు పాడడంలో కూడా మంచి పేరుతెచ్చుకుంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి