చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 10
- అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం
- 1768: బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా తొలి ఎడిషన్ ప్రచురించబడింది
- 1817: మిసిసిఫి అమెరికాలో 20వ రాష్ట్రంగా చేరింది
- 1830: అమెరికన్ రచయిత ఎమిలీ డికెన్సన్ జననం
- 1877: తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు జననం
- 1880: సాహితీవేత్త కట్టమంచి రామలింగారెడ్డి జననం
- 1896: నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ శాస్రవేత్త, డైనమైట్ సృష్టికర్త ఆల్‍ఫ్రెడ్ నోబెల్ మరణం
- 1901: స్టాక్‌హోమ్ లో తొలిసారిగా నోబెల్ బహుమతుల ప్రధానం జరిగింది
- 1902: కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్.నిజలింగప్ప జననం (కర్ణాటక ముఖ్యమంత్రుల జాబితా)
- 1932: శాసనాల శాస్త్రిగా పేరుపొందిన బి.ఎన్.శాస్త్రి జననం
- 1948: ఐక్యరాజ్యసమితిచే మానవ హక్కుల తీర్మానం ఆమోదించబడింది
- 1955: జవహర్‌లాల్ నెహ్రూచే నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది
- 1973: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవి చేపట్టారు (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా)
- 2001: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అశోక్ కుమార్ మరణం
- 2003: అంతర్జాలంలో స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం తెలుగు వికీపీడియా ప్రారంభమైంది
- 2013: తెలంగాణ తొలి గేయకవి రావెళ్ళ వెంకట రామారావు మరణం
- 2017: ప్రముఖ శాస్త్రవేత్త, CCMB మాజీ డైరెక్టర్ లాల్జీసింగ్ మరణం
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి