21, ఫిబ్రవరి 2015, శనివారం

విజయవాడ (Vijayawada)

విజయవాడ
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
జనాభా8,51,282
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నగరాలలో ఒకటైన విజయవాడ కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉంది. ఇది ప్రసిద్ధ వ్యాపారకేంద్రం మరియు పర్యాతక కేంద్రంగానూ పిలువబడుతోంది. చెనై-కోల్‌కత రైలు మార్గములో ఉండే విజయవాడ దక్షిణ మధ్య రైల్వేలో అతి పెద్ద కూడలి. 5వ నెంబరు మరియు 9వ నెంబరు జాతీయ రహదారులు నగరం మీదుగా వెళ్ళుచున్నాయి. బెజవాడగా కూడా పిలువబడే ఈ నగరం 61.8 చ.కి.మీ. విస్తీర్ణములో 2001 జనాభా లెక్కల ప్రకారం 8,51,282 జనాభాను కలిగియుంది. ఎన్టీయార్ వైద్యవిశ్వవిద్యాలయం నగరంలో ఉంది. కనకదుర్గ దేవాలయం, ప్రకాశం బ్యారేజీ, విక్టోరియా మ్యూజియం, కొండపల్లి కోట, ఉండవల్లి గుహలు, భవానీద్వీపం నగర సమీపంలోని పర్యాటక ప్రాంతాలు.

భౌగోళికం:
ఆంధ్రప్రదేశ్‌లో రెండో పెద్ద నగరమైన విజయవాడ కృష్ణా జిల్లాలో కృష్ణానది ఒడ్డున 80° 38'  తూర్పు రేఖాశం, 16° 30'  ఉత్తర అక్షాంశంపై ఉంది.

కనకదుర్గ ఆలయం

చరిత్ర:
విజయవాడ ప్ర్రాచీనమైన నాగరికత ఆనవాళ్ళను కలిగియుంది. కీ.శ. 7వ శతాబ్దిలో ఇక్కడ బౌద్ధ మతము బాగా ప్రాచుర్యములో ఉన్నప్పుడు చైనా యాత్రికుడైన హుయాన్ త్సాంగ్ ఈ ప్రాంతాన్ని దర్శించాడు. బ్రిటీషువారి కాలంలో ఈ ప్రాంతము అభివృద్ధి సాధించింది. వారి కాలంలో కృష్ణానదిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు.

ఆర్థికం:
విజయవాడ ప్రముఖ వర్తక మరియు వ్యాపార కేంద్రమైంది. మోటారు వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. పలు పెద్ద షాపింక్ కాంప్లెక్సులు ఉన్నాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో హోల్‌సేల్ వ్యాపారం విజయవాడనుండి పెద్దయెత్తున జరుగుతుంది. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను మరియు జాతీయ రహదారి కూడలి.

ప్రకాశం బ్యారేజి
నగర పాలన:
విజయవాడ నగరపాలన విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతుంది. నగరపాల సంస్థ పరిధిలో 59 డివిజన్‌లు కలవు. ఒక్కో డివిజన్ నుండి ఒక్కో కార్పొరేటర్, నగరానికి ఒక మేయర్‌ ఎన్నుకోబడి నగర పాలన బాధ్యతను నిర్వహిస్తారు. మేయరు పర్యవేక్షణలో పాలన జరుగుతుంది. పారిశుద్ధ్యం, వీధిదీపములు, నీటిసరఫరా నగరపాలన ముఖ్య విధులు. ఆస్తిపన్నులు, నీటిపన్నులు, గృహనిర్మాన అనుమతులు తదితరాలచే నగరపాలక సంస్థ ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.

ఇవి కూడా చూడండి:హోం,
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ నగరాలు, భారతదేశ నగరాలు, కృష్ణా జిల్లా, విజయవాడ,


 = = = = =Tags: Vijayawada information in Telugu, Andhra Pradesh Towns and Cities information in Telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక