భారతదేశపు 28 రాష్ట్రాలలో పంజాబ్ ఒకటి. భారతదేశ వాయువ్యాన ఉన్న ఈ రాష్ట్రపు రాజధాని చండీగఢ్. పంచనదులు ప్రవహించు ప్రాంతంగా ప్రసిద్ధి చెంది ఆ పేరుతో పిల్వబడ్డ పంజాబ్ దేశ విభజన సమయంలో రెండు ముక్కలై పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్‌లో కలువగా తూర్పు పంజాబ్ భారత్‌లో భాగమైంది. 1966లో పంజాబ్‌ను విడదీసి హర్యానాను కొత్తగా ఏర్పాటుచేసి ఇరు రాష్ట్రాలకు చండీగఢ్ రాజధానిగా చేశారు. ప్రస్తుతం పంజాబ్‌లో 22 జిల్లాలు, 117 శాసనసభ స్థానాలు, 13 లోక్‌సభ స్థానాలు, 7 రాజ్యసభ స్థానాలు కలవు. పంజాబ్‌లో అత్యధిక మతస్థులు సిక్కులు, హిందువులు రెండోస్థానంలో ఉన్నారు. ప్రసిద్ధి చెందిన భాంగ్రా, గిద్ద నృత్యాలు ఈ రాష్ట్రానికి చెందినవి. పంజాబ్ కేసరిగా పేరుగాంచిన లాలాలజపతి రాయ్, రాష్ట్రపతిగా పనిచేసిన జైల్ సింగ్, ప్రధానమంత్రిగా పనిచేసిన మన్‌మోహన్ సింగ్, ప్రముఖ క్రీడకారులు మిల్కాసింగ్, రచయిత్రి అమృతాప్రీతం, భారత తొలి మహిళా ఎపీఎస్ అధికారి కిరణ్ బేడి పంజాబ్‌కు చెందినవారు. లూథియానా, అమృత్‌సర్, జలంధర్, పాటియాలా, భటిండా, హోషియార్‌పూర్ పంజాబ్‌లోని పెద్ద నగరాలు. భౌగోళికం, సరిహద్దులు: 50,362 చకిమీ వైశాల్యంతో దేశంలో 20వ స్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి ఉత్తరాన జమ్మూ కేంద్రపాలిత ప్రాంతం, దక్షిణాన హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్, పశ్చిమాన పాకిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: పంజాబ్ చాలా పురాతనమైన చరిత్రను కల్గియుంది. మహాభారత కాలంలో పంజాబ్ త్రిగర్తగా పిల్వబడింది. సింధూనాగరికతకు చెందిన రోపార్ పట్టణం పంజాబ్‌లో బయటపడింది. మధ్యయుగంలో కొత్తగా అవతరించిన సిక్కుమతం పంజాబ్‌లో ఉద్భవించింది. 19వ శతాబ్దిలో రంజిత్ సింగ్ పాలించిన సిక్కు రాజ్యంలో ప్రస్తుత పంజాబ్ భాగంగా ఉండేది. బ్రిటీష్ కాలంలో ప్రత్యేకంగా పంజాబ్ ప్రావిన్స్ ఏర్పాటుచేయబడింది. 1947లో దేశవిభజన సమయంలో పంజాబ్ ప్రావిన్స్ పశ్చిమభాగం పాకిస్తాన్‌కు వెళ్ళగా, తూర్పు భాగం భారత్‌లో భాగమైంది. 1966లో పునర్విభజనలో హర్యానాను వేరుచేయబడింది. ఆర్థికవ్యవస్థ: పంజాబ్‌లో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. నీటిపారుదల కాలువల వల్ల వరి, చెరకు, గోధుమ, పండ్ళు, కూరగాయల ఉత్పత్తి బాగుంది. 1960 దశకంలో హరితవిప్లవం వల్ల వ్యవసాయంలో గణనీయమైన పురోగతి వచ్చింది. జలంధర్, లూధితానా, అమృత్‌సర్, పాటియాలా, భటిండా లలో పరిశ్రమలు స్థాపించబడ్డాయి. డేరాబస్సి, లూధియానాలు బట్టల పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి. బటాలా, గురుదాస్‌పూర్‌లలో చక్కెర పరిశ్రమలున్నాయి. డైరీపరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది. క్రీడలు: కబడ్డి పంజాబ్ రాష్ట్ర అధికార క్రీడ. హాకీ, క్రికెట్‌లు కూడా జనాదరణ కల్గిన క్రీడలు. నవజ్యోత్‌సింగ్ సిద్ధూ, బల్బీర్‌సింగ్, జస్వంత్ సింగ్, అభినవ్ బింద్రా, మోహిందర్ అమర్‌నాథ్, యువరాజ్ సింగ్, పర్గత్ సింగ్, హీనాసిద్ధూ లాంటి ప్రముఖ క్రీడాకారులు పంజాబ్‌కు చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
17, జూన్ 2020, బుధవారం
పంజాబ్ (Punjab)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి