13, జనవరి 2021, బుధవారం

దుర్గ్ జిల్లా (Durg District)

రాష్ట్రం
ఛత్తీస్‌గఢ్
వైశాల్యం
2,718 చకిమీ
జనాభా
17.21 లక్షలు (2011)
జిల్లా ప్రముఖులు
అనురాగ్ బసు, భూపేష్ భాఘేల్
దుర్గ్ జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 28 జిల్లాలలో ఒకటి. జిల్లా వైశాల్యం 2,718 చకిమీ మరియు 2011 జనాభా లెక్కల ప్రకారం 17.21 లక్షల జనాభా కల్గియుంది. మినీ ఇండియాగా పిల్వబడే పారిశ్రామిక పట్టణం భిలాయ్ ఈ జిల్లాలో ఉంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపేష్ భాఘేల్ ఈ జిల్లాకు చెందినవారు. జిల్లాలో 3 తహసీల్స్ ఉన్నాయి. కుంహరిలో మహామాయ ఆలయం ఉంది. పాండవాని నృత్యం జిల్లాకు చెందిన ప్రధాన నృత్యం. జిల్లాలో 3 తహసీల్లు, 389 రెవెన్యూ గ్రామాలు, 10 పురపాలక సంఘాలు కలవు.

భౌగోళికం, సరిహద్దులు:
దుర్గ్ జిల్లా 20°23' నుంచి 22°02 ఉత్తర అక్షాంశం మరియు 80°46' నుంచి 81°88' తూర్పు రేఖాంశం మధ్యలో 2,238 చకిమీ వైశాల్యంతో ఉంది. దుర్గ్ జిల్లా మహానది పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది. శివనాథ్ నది జిల్లా గుండ ప్రవహిస్తుండగా, దుర్గ్ జిల్లా తూర్పు సరిహద్దు గుండా కారున్ నది ప్రవహిస్తోంది. జిల్లాలో 9% అటవీప్రాంతం ఉంది. జిల్లాకు ఉత్తరాన బెమెతెర జిల్లా, తూర్పున రాయ్‌పూర్ జిల్లా, పశ్చిమాన రాజ్‌నందన్‌గావ్ జిల్లా, దక్షిణాన బాలోడ్ జిల్లా, ఆగ్నేయాన ధంతారి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర:
దుర్గ్ జిల్లా 1906లో ఏర్పడింది, 1906కు ముందు రాయ్‌పూర్ జిల్లాలో దుర్గ్ తహసీల్‌గా ఉండేది. 1973లో దుర్గ్ జిల్లా నుంచి రాజ్‌నందన్‌గాన్ జిల్లా వేరుపడింది. 2000లో ఛత్తీస్‌గఢ్ అవతరణకు ముందు ఈ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా కొనసాగింది. 2012లో జిల్లా మళ్ళీ ముక్కలై  Bemetara, Balod కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి.

ఆర్థికం:
భిలాయ్‌లో ఇనుము-ఉక్కు కర్మాగారం ఉంది. ఇది 1959లో రష్యా సహకారంతో ప్రారంభించబడింది. జిల్లాలో ప్రధాన వృత్తి వ్యవసాయం.

రవాణా సౌకర్యాలు:
జాతీయ రహదారి నెం.6 (ముంబాయి-కోల్‌కత) దుర్గ్ జిల్లా మీదుగా వెళ్తుంది (జిల్లా కేంద్రం దుర్గ్ మీదుగా). ముంబాయి-కోల్‌కత రైలుమార్గం కూడా దుర్గ్ జిల్లా మీదుగా వెళ్ళుచున్నది. దుర్గ్ జిల్లా సౌత్-ఈస్ట్ రైల్వే జోన్‌లో భాగంగా ఉంది. రాజ్‌నందన్‌గాన్-రాయ్‌పూర్ మధ్యలో దుర్గ్ రైల్వేస్టేషన్ ఉంది. జిల్లాలో విమానాశ్రయం లేదు కాని జిల్లా కేంద్రం దుర్గ్ నుంచి 50 కిమీ దూరంలో రాయ్‌పూర్‌లో విమానాశ్రయం ఉంది.
 
జిల్లాలోని పురపాలక సంఘాలు:
దుర్గ్, భిలాయ్, రిసాలి, భిలాయ్ చరొడ, అహివాలా, కుమహరి, జాముల్, ధమ్‌ధా, పటాన్, ఉటాయ్,
భూపేష్ భాఘేల్


ఇవి కూడా చూడండి:
  • ఛత్తీస్‌గఢ్ జిల్లాలు,
  • భిలాయ్ ఉక్కు కర్మాగారం,
  • దుర్గ్ లోక్‌సభ నియోజకవర్గం,
  • శివనాథ్ నది,
  • అనురాగ్ బసు,
  • భూపేష్ భాఘేల్,


హోం
విభాగాలు: ఛత్తీస్‌గఢ్ జిల్లాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి