ప్రముఖ పాత్రికేయుడిగా పేరుపొందిన తుర్లపాటి కుటుంబరావు ఆగస్టు 10, 1933న విజయవాడలో జన్మించారు. ప్రారంభంలో టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగా పనిచేశారు. తన పాత్రికేయ ప్రస్థానంలో 18 ముఖ్యమంత్రుల వద్ద పనిచేశి "18 ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు" పుస్తకాన్ని రాశారు. భారతప్రభుత్వం నుంచి 2002లో పద్మశ్రీ పురస్కారం పొంది ఈ ఘనత పొందిన తొలి తెలుగు జర్నలిస్టుగా పేరుపొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంచే కళాప్రపూర్ణ పొందారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశారు. 20వేల సమావేశాలలో వక్తగా ప్రసంగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. "నా కలం - నా గళం" పేరిట ఆత్మకథను రాశారు. జనవరి 11, 2021న తుర్లపాటి మరణించారు.
పాత్రికేయ ప్రస్థానం: ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాల ప్రభావంతో తుర్లపాటి పత్రికారచన ప్రారంభించి 1951లో ఎన్జీ రంగా వాహిని పత్రికలో తొలిసారిగా ఉప సంపాదకులుగా పనిచేసి ఆ తర్వాత చలనాని రామారాయ్ "ప్రతిభ" పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజాపత్రికలో ఆంధ్రప్రాంత వార్తల సంపాదకునిగా పనిచేశారు. 1960-63 మరియు 1965-91 కాలంలో ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. ఆ తర్వాత వార్త పత్రికలో కొంతకాలం పనిచేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తున్నప్పుడు వార్తల్లోని వ్యక్తి శీర్షికన సుమారు 4000 వ్యక్తుల జీవితచరిత్రను అందించారు. ఈ శీర్షిక వల్ల తుర్లపాటికి మంచిపేరు వచ్చింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి