14, జూన్ 2019, శుక్రవారం

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)

ఛత్తీస్‌గఢ్
రాజధాని రాయ్‌పూర్
వైశాల్యం1,35,191 Sq km
జనాభా2.55 కోట్లు
అధికార భాషహిందీ
ఛత్తీస్‌గఢ్ భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. వైశాల్యం ప్రకారం ఈ రాష్ట్రం దేశంలో 10వ పెద్ద రాష్ట్రం మరియు జనాభా ప్రకారం 16వ పెద్ద రాష్ట్రం. విద్యుత్తు మరియు ఉక్కు ఉత్పత్తిలో ఈ రాష్ట్రం ముందంజలో ఉంది. నవంబరు 1, 2000 నాడు అవతరించిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అంతకుక్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో 27 జిల్లాలు, 11 లోక్‌సభ నియోజకవర్గాలు, 5 రాజ్యసభ స్థానాలు, 90 అసెంబ్లీ స్థానాలూన్నాయి. ఈ రాష్ట్ర రాజధాని మరియు పెద్ద పట్టణము రాయ్‌పూర్. అధికార భాష హిందీ.

ఛత్తీస్‌గఢ్ ఉత్తరభాగం గంగానది పరీవాహకప్రాంతంలోనూ, మధ్యభాగం మహానది పరీవాహక ప్రాంతంలోనూ, దక్షిణ భాగం గోదావరి నది పరీవాహక ప్రాంతంలోనూ ఉన్నాయి. దక్షిణభాగం దక్కన్ మైదానంలో, ఉత్తర భాగం గంగాసింధూ మైదానంలో భాగంగా ఉంది. ఈ రాష్ట్రానికి సముద్రతీరం లేదు. ఈ రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నది మహానది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ రాష్ట్రానికి ఉత్తరాన ఉత్తరప్రదేశ్, ఈశాన్యాన ఝార్ఖండ్, తూర్పున ఒడిషా, దక్షిణాన తెలంగాణ, పశ్చిమాన మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా:
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రైలురవాణాలో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లో భాగము. ఈ జోన్ కేంద్రస్థానం బిలాస్‌పూర్ కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. బిలాస్‌పూర్, దుర్గ్, రాయ్‌పూర్ ఈ రాష్ట్రంలోని ప్రధాన రైల్వే జంక్షన్లు. రాయ్‌పూర్‌లో స్వామి వివేకానంద విమానాశ్రయం ఉంది.

జనాభా:

2011 లెక్కల ప్రకారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర జనాభా 2.55 కోట్లు. జనాభాలో హిందువులు 93%, ముస్లింలు 2%, క్రైస్తవులు 2% ఉన్నారు. జనాభాలో పెద్ద నగరాలు రాయ్‌పూర్, భిలాయ్-దుర్గ్, బిలాస్‌పూర్, రాజ్‌నందన్‌గాన్, రాయ్‌గఢ్, కోర్బా, అంబికాపూర్, జగదల్‌పూర్.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, ఛత్తీస్‌గఢ్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక