భౌగోళికంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన రష్యా యూరప్ మరియు ఆసియా ఖండాలలో విస్తరించియుంది. 1991కు ముందు సోవియట్ యూనియన్‌గా పిలువబడి 15 భాగాలు వేరుపడిన తర్వాత 1917కు ముందున్న రష్యా పేరు మళ్ళీ స్థిరపడింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఒక బలమైన అగ్రరాజ్యంగా ఏర్పడి రక్షణ, రోదసి తదితర రంగాలలో అమెరికాతో తీవ్రంగా పోటీపడి 1991 తర్వాత బలహీనపడింది. 1.7 కోట్ల చకిమీ విస్తీర్ణంతో ఉన్న రష్యా 14.3 కోట్ల జనాభాతో 8వ స్థానంలో ఉంది. ప్రముఖ భౌగోళిక శాస్త్రవేత్త కోపర్నికస్, రసాయన శాస్త్రవేత్త మెండెలీవ్, జీవశాస్త్రవేత్త డిమిత్రి ఇవానోవ్‌స్కీ, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇవాన్ పావలోవ్, ఆర్థికవేత్త సైమన్ కుజ్‌నెట్స్, రోదసిలోకి వెళ్ళిన తొలి మానవుడు యూరి గగారిన్ రష్యాకు చెందినవారు. దేశ రాజధాని మాస్కో మరియు సెయింట్ పీటర్స్‌బర్గ్ రష్యాల్లోని పెద్ద నగరాలు.
భౌగోళికం: రష్యా దేశం 41°ఉత్తర అక్షాంశం నుంచి 82° ఉత్తర అక్షాంశం మరియు 19° తూర్పు రేఖాంశం నుంచి 169° పశ్చిమ రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. 1.7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉంది. ఈ దేశానికి ఉత్తరాన టండ్రా మంచుపర్వాతలు ఉన్నాయి. ఉత్తర భాగంలో జనసంఖ్య చాలా తక్కువ. ఉత్తర భాగం ధృవప్రాంతానికి సమీపంలో ఉండుటచే ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో నమోదౌతుంది. జనాభా: రష్యా విశాలమైన దేశం అయినప్పటికీ జనాభా తక్కువగా ఉంది. రష్యా జనాభాలో అధికంగా యూరప్ ప్రాంతంలోని భూభాగంలో ముఖ్యంగా యూరప్ పర్వతప్రాంత భూభాగంలోనే అధికంగా కేంద్రీకృతమైంది. ఆసియా ప్రాంత రష్యా ఉత్తర భాగం మంచుప్రాంతం కావడంతో జనసాంద్రత అత్యల్పంగా ఉంది. రష్యా మొత్తం జనాభా 14.7 కోట్ల కాగా అందులో 73% పట్టణ ప్రాంతాలలో నివశిస్తున్నారు. రాజధాని మాస్కోలో 1.15 కోట్ల జనాభా ఉండగా మరో 14 నగరాలలో 10 లక్షలకు మించిన జనాభా ఉంది.
16వ శతాబ్దిలో రష్యాలో సీజర్‌తో జార్ పాలన ఆరంభమైంది. జార్ల కాలంలో రష్యన్ భూభాగం మరింత పెరిగింది. 1721లో పీటర్-ది-గ్రేట్ రష్యాను సామ్రాజ్యంగా ప్రకటించాడు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌ను నిర్మించి దేశ రాజధానిగా చేశాడు. 1756-63 కాలంలో సప్తవర్ష సంగ్రామ జరిగింది. 19వ శతాబ్ది ప్రారంభంలో నెపోలియన్ రష్యాను ఆక్రమించడానికి ప్రయత్నించిననూ సఫలం కాలేడు. 1905లో మాత్రం రష్యా చిన్న దేశమైన జపాన్ చేతిలో ఓడిపోయింది. 1914లో రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రవేశించి యుద్ధం సమాప్తం కాకముందే 1917లో రష్యన్ విప్లవం జరిగింది. కమ్యూనిస్ట్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్కులు అధికారాన్ని చేజిక్కించుకుని సోషలిస్ట్ రష్యన్ సమాఖ్య (USSR)ను ఏర్పాటు చేశారు. జోసెఫ్ స్టాలిన్ హయాంలో రష్యా పారిశ్రామికంగానూ, వ్యవసాయికంగానూ అప్రతిహతంగా పురోగమించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికాతో పోటీగా అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళి 1991లో నైరుతి రష్యా భాగంలో 15 భాగాలు వేరుపడి ప్రత్యేక దేశాలుగా మారడంతో రష్యా బలహీనపడింది. ఆర్థిక వ్యవస్థ: విశాలమైన రష్యన్ భూభాగంలో సహజవాయువు మరియు పెట్రోలియం నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. స్థూల జాతీయోత్పత్తి ప్రకారం ఇది ప్రపంచంలో 8వ పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశము. తీరప్రాంతం అధికంగా ఉండుటచే చేపల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది.
ప్రాచీనకాలం నుంచి శాస్త్ర-సాంకేతిక రంగాలలో రష్యా పేరుగాంచింది. 15వ శతాబ్దికి చెందిన ప్రముఖ భౌగోళిక శాస్త్రవేత్త కోపర్నికస్, పీరియాడిక్ పట్టిక రూపొందించిన రసాయన శాస్త్రవేత్త మెండెలీవ్, జీవశాస్త్రవేత్త డిమిత్రి ఇవానోవ్‌స్కీ, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇవాన్ పావలోవ్, ఆర్థికవేత్తలు సైమన్ కుజ్‌నెట్స్, లియోంటిఫ్ రష్యాకు చెందిన ప్రముఖులు. తొలి కృత్రిమ రోదసి ఉపగ్రహం "స్పుత్నిక్-1" రష్యాచే ప్రయోగించబడింది. రోదసిలోకి వెళ్ళిన తొలి మానవుడు యూరి గగారిన్ రష్యాకు చెందినవాడే. క్రీడలు: ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యలో రష్యా రెండోస్థానంలో ఉంది. 1980లో వేసవి ఒలింపిక్ క్రీడలను, 2014లో శీతాకాల ఒలింపిక్ క్రీడలను రష్యా నిర్వహించింది. ఐస్‌హాకీ, రగ్బీ క్రీడలలో ఈ దేశ క్రీడాకారులకు మంచి పట్టు ఉంది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు అన్నా కోర్నికోవా, మరియా షరపోవా ఈ దేశానికి చెందినవారు.
= = = = =
|
10, జూన్ 2014, మంగళవారం
రష్యా (Russia)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి