గుజరాత్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మాధవ్‌సింగ్ సోలంకి జూలై 30, 1927న పిలుదర (మెహసనా జిల్లా, గుజరాత్)లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాధవ్‌సింగ్ సోలంకి గుజరాత్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 3సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 93 సం.ల వయస్సులో జనవరి 9, 2021న మరణించారు. ఈయన కుమారుడు భారత్ సింగ్ కూడా గుజరాత్ పిసిసి అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం : 1976లో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి చేపటిన సోలంకి 1980లో రెండోసారి కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టి పూర్తి ఐదేళ్ళు పదవిలో కొనసాగినారు. 1991లో పి.వి.నరసింహరావు మంత్రివర్గంలో కీలకమైన విదేశీవ్యవహారాల శాఖ మంత్రిపదవిని నిర్వహించారు. 1989లో మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినారు. ఈయన భద్రన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1980 దశకంలో క్షత్రియ, హరిజన, ఆదివాసి, ముస్లింల మద్దతుపై ఆధారపడ్డారు. గుజరాత్ రాజకీయాలలో ఇది ఖామ్ (KHAM) సిద్ధాంతంగా ప్రసిద్ధిచెందింది. ఇవి కూడా చూడండి :
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి