20, జులై 2021, మంగళవారం

యడ్లపాటి వెంకట్రావు (Yadlapati Venkatarao)

తెలుగు వికీపీడియా చచ్చిపోయిన తర్వాత అంతర్జాలంలో మిగిలిన ఏకైక తెలుగు విజ్ఞాన సర్వస్వం ఇది ఒక్కటే. దీన్ని ఆదరించండి, దీని గురించి ప్రచారం చేయండి, మరింత అభివృద్ధికి తోడ్పడండి.
జననం
డిసెంబరు 16, 1919
స్వస్థలం
అమృతలూరు మండలం బోడపాడు
జిల్లా
గుంటూరు జిల్లా
రంగం
రాజకీయాలు
పదవులు
రాష్ట్రమంత్రి, జడ్పీ చైర్మెన్,
స్వీయ చరిత్ర
నా జీవన గమనం
గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన యడ్లపాటి వెంకట్రావు డిసెంబరు 16, 1919న గుంటూరు జిల్లా అమృతలూరు మండలం బోడపాడులో జన్మించారు. చెన్నైలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాద వృత్తి చేపట్టి ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు. 
 
1962లో వేమూరు నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. 1967లో కూడా వేమూరు నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి సన్నపనేని వెంకట్రావుపై విజయం సాధించారు. 1978లో వేమూరు నుంచి జనతాపార్టీ తరఫున ఎన్నికై 1978-80 కాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
 
 1978లో సంగం డెయిరీ వ్యవస్థాపక చైర్మెన్ గా, 1981లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. 1983లో వేమూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి తెలుగుదేశం ఫార్టీ అభ్యర్థి నాదెండ్ల భాస్కరరావు చేతిలో ఓడిపోయారు. 1995-98 కాలంలో జిల్లా పరిషత్తు చైర్మెన్ గా పనిచేశారు. 1998లో జడ్పీ చైర్మెన్ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 
 
ప్రముఖ రైతు నాయకుడు ఎన్.జి.రంగా ముఖ్యఅనుచరుడిగా రాణించారు. వెంకట్రావు తన స్వీయ జీవిత చరిత్రను 'నా జీవన గమనం' పేరుతో గ్రంధస్తం చేసారు.
 


హోం
విభాగాలు: గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, అమృతలూరు మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి