21, మే 2014, బుధవారం

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)

తెలుగుదేశం పార్టీ
స్థాపనమార్చి 29, 1982
స్థాపకుడుఎన్టీరామారావు
అధికారంలో ఉన్న కాలం1983-1989,
1994-2004,
రాష్ట్రాలుతెలంగాణ, ఆంధ్రప్రదేశ్,
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించారు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రెసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో ఈ పార్టీని స్థాపించిన ఎన్టీరామారావు 9 మాసాల స్వల్పకాలంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983-89 మరియు 1994-2004 కాలంలో తెలుగుదేశం ఫార్టీ అధికారంలో ఉండగా, విభజిత ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో అధికారం పొందడానికి సిద్ధంగా ఉంది.

ఎన్టీ రామారావు శకం:
1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన రామారావు పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1983 ఎన్నికలలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను 202 స్థానాలు సాధించి మూడింత రెండువంతుల అపురూప మెజారిటీని సాధించిపెట్టారు. పార్టీ స్థాపించిన కేవలం 9 మాసాలలోనే, గత రాజకీయ అనుభవం లేకున్ననూ రాజకీయవిశ్లేషకులు కూడా ఊహించని విధంగా మెజారిటీని పొందడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు
ఎన్టీరామారావు
1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కరరావు అప్పటి గవర్నరు రాంలాల్ సహకారంతో ఎన్టీరామారావును తోసివేసి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిననూ ప్రజాగ్రహంతో నెలరోజుల్లోనే తప్పుకోవాల్సి వచ్చింది. మళ్ళీ రామారావు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత శాసనసభను రద్దుపర్చి కొత్తగా ఎన్నికలు జరిపించి మళ్ళీ 200కు పైగా స్థానాలు సాధించి ప్రజలలో పార్టీకి, తనకు ఉన్న ఆదరణను నిరూపించుకున్నారు. కేవలం తనవల్లే పార్టీ విజయం సాధించిందనీ ఏకపక్షంగా పాలన సాగించడంతో 1989లో తెలుగుదేశం పార్టీ పరాజయం పొందింది. ఆ తర్వాత రామారావు లక్ష్మీపార్వతిని రెండొ వివాహం చేసుకున్నారు. 1994లో మరోసారి 200పైగా స్థానాలతో విజయం సాధించి మూడవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కాలంలో లక్ష్మీపార్వతి జోక్యం అధికం కావడంతో చంద్రబాబు నాయుడు నేతృవంలో పార్టీ శాసనసభ్యులు తిరుగుబాటు చేసి రామారావును పార్టీ నుంచి తొలిగించి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టింపజేశారు. 1996, జనవరి 18న రామారావు మరణించారు.

తెలుగుదేశం ఫార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబునాయుడు
చంద్రబాబు నాయుడు శకం:
ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబునాయుడు 1983లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి పరాజయం పొంది, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగి, అవకాశం రాగానే 1995 సెప్టెంబరులో మామ ఎన్టీఆర్ స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం ఫార్టీని విజయం సాధించిపెట్టి 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ను అత్యధికకాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత 2004, 2009లలో రెండుసార్లు పరాజయం పొందడంతో పదేళ్ళు అధికారానికి దూరంగా ఉండవలసి వచ్చింది. 2014లో భారతీయ జనతాపార్టీతో పొత్తుపెట్టుకొని పోటీచేసి తెలంగాణలో 20 స్థానాలు, సీమాంధ్రలో మెజారిటీ స్థానాలు పొందారు. రాష్ట్ర విభజన అమలులోకి వచ్చిన వెంటనే విభజిత ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి రానున్నారు.

లోకసభ తొలి దళిత స్పీకరు
జి.ఎం.సి.బాలయోగి
కేంద్రమంత్రివర్గంలో పార్టీ సభ్యులు:
1996 యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉండటంతో తెదేపా నుంచి నలుగురు ఎంపీలు కేంద్రమంత్రులయ్యారు. కింజరాపు ఎర్రన్నాయుడు, బోళ్ల బుల్లిరామయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సముద్రాల వేణుగోపాలచారిలకు ఈ అవకాశం లభించింది. ఆ తర్వాత భాజపాతో పొత్తుపెట్టుకొని విజయం సాధించి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్ననూ కేంద్రమంత్రివర్గంలో చేరక కేవలం లోకసభ స్పీకర్ పదవి మాత్రమే తీసుకున్నారు. జీఎంసి బాలయోగి తెదేపా తరఫున ఈ పదవి పొంది తొలి దళిత లోకసభ స్పీకరుగా ఘనతకెక్కారు. నరేంద్రమోడి నేతృత్వంలోని 2014 కేంద్రమంత్రివర్గంలో చేరడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా ఉంది.

విభాగాలు: భారతదేశ రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 1982లో స్థాపనలు, తెలుగుదేశం పార్టీ,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక