స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు అయిన గోగినేని రంగనాయకులు నవంబరు 7, 1900న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించారు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్య పూర్తిచేసి గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనారు. 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్ధిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమం, రైతు ఉద్యమాలలో పనిచేశారు. రైతాంగ ఉద్యమాలలో పాల్గొని భారత కిసాన్ ఉద్యమానికి పితామహుడిగా పేరుపొందారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జమీందారి రైతు ఉద్యమాన్ని నిర్వహించారు.
1930 లో మహాత్మాగాంధీ పిలుపునకు స్పందించి రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1931లో ఏఐసిసి సభ్యులుగా నియమించబడ్డారు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించారు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. రైతులకోసం "వాహిని" పత్రికను నడిపారు. 1934లో నిడుబ్రోలులో భారతీయ రైతుసంస్థను స్థాపించారు. అనేక అంతర్జాతీయ మహాసభలలో భారతదేశం తరఫున ప్రతినిధిగా రంగా పాల్గొన్నారు. 1945లో రైతు-కూలి సమస్యమలై గాంధీజీతో చర్చలు జరిపి ఆ చర్చల ఆధారంగా "గాంధీ బ్లెసెస్" గ్రంథం రచించారు. రాజకీయ ప్రస్థానం: 1930లోనే రంగా కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1945లో ఆంధ్రా ప్రొవిజనల్ కాంగ్రెస్ కమిటికి, 1947లో తాత్కాలిక పార్లమెంటుకు ఎన్నికైనారు. 1951లో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షపదవికి పోటీచేసి నీలం సంజీవరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1952లో కృషికార్ లోక్‌పార్టీని స్థాపించారు. 1952లోనే గుంటూరు లోకసభకు పోటీచేసి ఓడిపోయారు. తర్వాత రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 1955లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1957లో రెండో లోకసభకు తెనాలి నుంచి కాంగ్రెసు పార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించి భారత కృషికార్ లోక్‌పార్టీ, ఆ తరువాత రాజాజీ తో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించారు. 1962లో గుంటూరు లోకసభకు పోటీచేసి పరాజయం పొందారు. చిత్తూరులో విజయం సాధించారు. 1967లో చిత్తురు నుంచి లోకసభకు పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత గౌతులచ్చన్న శ్రీకాకుళం సీటును ఖాళీచేసి గెలిపించారు. 1972లో రంగా తిరిగి కాంగ్రెసు(ఐ)లో చేరారు. 7, 8, 9వ లోకసభలకు కూడాకాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ పార్టీల తరఫున గుంటూరు నుంచి లోకసభకు ఎన్నికైనారు. మొత్తం 6 సార్లు లోకసభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికైనారు. జూన్ 9 , 1995న రంగా మరణించారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
9, జూన్ 2013, ఆదివారం
ఎన్.జి.రంగా (N.G.Ranga)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి