7, ఆగస్టు 2021, శనివారం

నీరజ్ చోప్రా (Neeraj Chopra)

నీరజ్ చోప్రా (eeraj Chopra)
జననం
డిసెంబరు 24, 1997
రంగం
జావెలిన్ త్రో క్రీడాకారుడు
అవార్డులు
అర్జున అవార్డు
పతకాలు
ఒలింపిక్ స్వర్ణం (2020)
జావెలిన్ త్రో క్రీడాకారుడు, 2020 టోక్యో ఒలింపిక్ క్రీడలలో స్వర్ణపతక విజేత అయిన నీరజ్ చోప్రా డిసెంబరు 24, 1997న హర్యాన్లోని పానిపట్టు జిల్లా ఖండేరా గ్రామంలో జన్మించాడు. అర్మీలో చేరి సుబేదార్ వృత్తి చేపట్టి విశిష్ట సేవా మెడల్ కూడా పొందినాడు
జావెలిన్ త్రోలో అనేక జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించాడు. 2017లో భువనేశ్వర్ ఆసియా చాంప్ లో స్వర్ణం, 2018 గౌహతి దక్షిణాసియా క్రీడలలో స్వర్ణం, 2018 జకర్తా ఆసియా క్రీడలలో స్వర్ణం, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణం సాధించాడు. 2018లో అర్జున అవార్డు పొందాడు. ఆగస్టు 7, 2021న టోక్యో ఒల్పింపిక్ క్రీడలలో 87.88 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం సాధించాడు.

టోక్యో ఒలింపిక్ క్రీడలలో స్వర్ణం సాధించి ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో భారతీయుడిగా (అభినవ్ బింద్రా తర్వాత) అవతరించాడు.
 
ఇవి కూడా చూడండి: 
*ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన క్రీడాకారులు,
*భారత ప్రముఖ క్రీడాకారులు,
*హర్యానా క్రీడాకారులు,


హోం
విభాగాలు:ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన క్రీడాకారులు, భారత ప్రముఖ క్రీడాకారులు, హర్యానా క్రీడాకారులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి