11, ఆగస్టు 2021, బుధవారం

గెల్లు శ్రీనివాస్ (Gellu rinivas)

గెల్లు శ్రీనివాస్

(Gellu Srinivas)

:








కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హమ్మత్ నగర్ కు చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. 2000-05 కాలంలో అఖల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004 నుంచి తెరాసలో చురుకుగా పాల్గొంటున్నారు. 2006-07లో హైదరాబాదు విశ్వవిద్యాలయం అధ్యక్షుడీగా పనిచేశారు. మలివిడత తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు. 2017 నూంచ్చి తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2021 హుజురాబాదు ఉప ఎన్నికలలో తెరాస తరఫున పోటీచేస్తున్నారు.
తండ్రి గెల్లు మల్లయ్య కొండపాక ఎంపీటీసిగా పనిచేశారు. తల్లి హిమ్మత్ నగర్ సర్పంచిగా ఎన్నికయ్యారు.
 

 
 




హోం
విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి