శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన ధర్మాన కృష్ణదాస్ 2004, 2009, 2012 (ఉప ఎన్నిక)లో వరుసగా 3 సార్లు నరసన్నపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2012 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కృష్ణదాస్ జగన్ పక్షాన వహించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికలో వైకాపా తరఫున ఎన్నికయ్యారు. 2014లో వైకాపా తరఫున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భగ్గు రమణమూర్తి చేతిలో స్వల్పతేడాతో ఓడిపోయారు. 2019లో మళ్ళీ నరసన్నపేట నుంచే శాసనసభకు 4వ సారి ఎన్నికయ్యారు. 2019లో వై.ఎస్.జగన్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 2020 జూలైలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైనారు.
ఈయన సొదరుడు ధర్మాన ప్రసాదరావు కూడా రాజకీయ నాయకుడు. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా, నలుగురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిగా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి