ప్రముఖ రాజకీయనాయకుడు, పారిశ్రామికవేత్త అయిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 21 డిసెంబరు, 1972న కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో జన్మించారు. తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి 2009లో తొలిసారిగా కడప నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినారు. జగన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పులివెందుల శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజకీయ ప్రస్థానం: 2009లో జగన్మోహన్ రెడ్డీ తొలిసారి కడప లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. కొంతకాలానికే తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేసిననూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి వాదనకు ప్రక్కకుపెట్టి కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ తర్వాత రోశయ్య రాజీనామా అనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించారు. దీనితో 2011లో జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించి, వైకాపా తరఫున మళ్ళీ పోటీచేసి కడప నుంచి 5లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికలలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.వైఎస్సార్‌సీపీ పార్టీ ఓడిపోయిననూ జగన్ ప్రజల మధ్యలో ఓదార్పుయాత్రలో, పాదయాత్రలో మధ్యలో 16 నెలలు జైలులో ఉన్నారు. 2019 శాసనసభ ఎన్నికలలో పూర్తి మెజారిటీతో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడంతో మే 30, 2019న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అభియోగాలు- జైలుజీవితం: జగన్మోహన్ రెడ్డిపై అక్రమ ఆస్తులకు సబంధించి పలు అభియోగాలు నమోదైనాయి. ఇదే అభియోగంపై సిబిఐ చే అరెస్ట్ అయి సుమారు 16 మాసాలు జైలులో ఉన్నారు. కుటుంబం: జగన్ తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పులివెందుల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, కడప నుంచి 4 సార్లు ఎంపిగా గెలుపొందడమే కాకుండా రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జగన్ తల్లి విజయమ్మ తండ్రి మరణానంతరం పులివెందుల నుంచి కాంగ్రెస్ తరఫున, ఆ తర్వాత రాజీనామా చేసి వైకాపా తరఫున ఎన్నికయ్యారు. విజయమ్మ వైకాపా గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. 2014లో విశాఖపట్టణం లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందారు. జగన్ సోదరి షర్మిల వైకాపా తరఫున ప్రచార బాధ్యతలు చేపట్టారు. జగన్ జైలులో ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
17, మే 2014, శనివారం
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి (Y.S.Jaganmohan Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి