3, మే 2014, శనివారం

నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం (Narasannapet Assembly Constituency)

నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 127. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 8 గా మారింది. నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.

నియోజకవర్గంలోని మండలాలు,:
 • నరసన్నపేట, 
 • పొలాకి, 
 • జలమూరు, 
 • సారవకోట

గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ధర్మాన కృష్ణదాస్ కాంగ్రెస్ పార్టీ బి.లక్ష్మణరావు తెలుగుదేశం పార్టీ
2012* ధర్మాన కృష్ణదాస్ వైఎస్సార్ కాంగ్రెస్ ధర్మాన రామదాస్ కాంగ్రెస్ పార్టీ
2014 బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ ధర్మాన కృష్ణదాస్‌ వైఎస్సార్ కాంగ్రెస్
2019 ధర్మాన కృష్ణదాస్ వైకాపా బగ్గు రమణమూర్తితెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి.లక్ష్మణరావుపై 17399 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. కృష్ణదాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి విప్ ఉల్లంఘించడంతో శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. దీనితో 2012లో ఉప ఎన్నికలు జరిగాయి.

2012 ఉప ఎన్నికలు:
2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ కాంగ్రెస్ పార్టి తరఫున పోటీచేసిన ధర్మాన కృష్ణదాస్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన రామదాస్ పై 7312 మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 174289 ఓటర్లలో 139765 పోల్ కాగా అందులో వైకాపాకు 54454 ఓట్లు, కాంగ్రెస్ కు 47172 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 32401 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన బగ్గు రమణమూర్తి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మాన కృష్ణదాస్‌పై 4889 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి పై 19555 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక